విద్యుత్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా మోతే శ్రీనివాస్ ఎన్నిక

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)జూన్07:హుజురాబాద్ పట్టణంలో  1104 విద్యుత్ ఉద్యోగుల సంఘం డివిజన్ స్థాయి ఎన్నికలు శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగాయి.విద్యుత్ ఉద్యోగుల సంగం డివిజన్ అధ్యక్షునిగా మోతే శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి గా డి.శంకర్,వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహేశ రవి,అడిషనల్ సెక్రటరీ గా అశ్వంత్ కుమార్ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా డివిజన్ స్థాయి అధ్యక్షునిగా ఎన్నికైన మోతే శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల కోసం నిరంతరం కృషి చేస్తానని, బదిలీ విషయాలలో నిష్పక్షపాతంగా అందరితో చర్చించి సమన్వయంగా కృషి చేస్తానని తెలిపారు. తనను … Read more

దశాబ్ది ఉత్సవాలకు తరలివెళ్లిన హుజురాబాద్ ఉద్యమకారులు

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)జూన్02:తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు నిండిన సందర్భంగా  ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు హుజురాబాద్ ప్రాంతానికి చెందిన ఉద్యమకారులు ఆదివారం రోజున అధిక సంఖ్యలో హైదరాబాద్ కు తరలివెళ్లారు.తమ త్యాగాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోక నిర్లక్ష్యం చేసిందని వారు ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించడం హర్షణీయమని,ఇదే వైఖరిని ప్రభుత్వం కొనసాగిస్తుందని, ఉద్యమకారుల సలహాలు, సూచనలు తీసుకుని తెలంగాణ పునర్నిర్మాణం చేస్తుందని వారు … Read more

దుద్దెనపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ఎన్నిక

సైదాపూర్(ధనాధన్ న్యూస్)జూన్02:సైదాపూర్ మండలంలోని దుద్దేనపల్లి గ్రామంలో ఆదివారం రోజున ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.కుల పెద్దమనిషిగా గూళ్ల వెంకటయ్య,ప్రెసిడెంట్ గా నెల్లి శ్రీనివాస్,క్యాషియర్ గా నీల తిరుపతి,వైస్ ప్రెసిడెంట్ గా రొయ్యల శ్రీనివాస్, మెంబర్లు గా బొల్లి సురేష్,గూళ్ల అజయ్,పిట్టల కొమురయ్య,పిట్టల మొండయ్య,పెసరి సమ్మయ్య,నీల సమ్మయ్య లను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ప్రెసిడెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ నా పై నమ్మకం ఉంచి నా ఎన్నికకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా … Read more

ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)జూన్01:హనుమాన్ జన్మదిన పర్వదినాన్ని పురస్కరించుకుని జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామంలో హనుమాన్ మాల ధారణ స్వాములు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయమే స్వామీకి ప్రత్యేక అభిషేకం చేశారు.అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.అభిషేకం చేసే సమయంలో రాముని భజన,రామ నామ స్మరణతో భక్తులు తన్మయత్వం పొందారు.జయంతి సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు ఆలయాన్ని సందర్శించి ప్రత్యెక మొక్కులు చెల్లించుకున్నారు.విరుముడి కట్టుకొని హనుమాన్ మాల ధారణ స్వాములు విరమణకు బయలుదేరారు.అనంతరం మహా … Read more

ప్రైవేటు విద్యాసంస్థల విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే30:తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలు విద్య వ్యాపారం చేస్తూ ఫీజుల పేరుతో లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారని, సిఎం రేవంత్ రెడ్డి రాష్ర్టంలో ప్రైవేట్ విద్యాసంస్థలు చేస్తున్న   ఫీజుల దోపిడీ అరికట్టే విధంగా  చర్యలు తీసుకొని ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని, ఎన్నికల హామీలో విద్యార్థులకు  ఇచ్చిన హామీలను విద్యాసంవత్సరం ప్రారంభం కాగానే అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి లద్దునూరి విష్ణు  అన్నారు.ఆయన మాట్లాడుతూ జమ్మికుంట పట్టణ కేంద్రంలో ఉన్న ప్రైవేటు విద్యాసంస్థలను ఆయా … Read more

తెలంగాణలో ప్రజావ్యతిరేక పాలన సాగుతుంది

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే30:జమ్మికుంట పట్టణంలోని జెడ్పిటిసి కార్యాలయంలో పత్రిక సమావేశంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ప్రజా వ్యతిరేక కొనసాగుతుందని, ఈ సందర్భంగా జమ్మికుంట జడ్పిటిసి డాక్టర్.శ్రీరామ్ శ్యామ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా కాంగ్రెస్ పాలన ప్రజలకు ఎంతగానో మేలు చేసిందని భావించిన తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి పాలన మొండి చేయి చూసిందని వారు గుర్తు చేశారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలల గడుస్తున్నప్పటికీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో రూపొందించిన.ఏ ఒక్క అంశం కార్యచరణ … Read more

గ్రామపంచాయతీ ని సందర్శించిన జిల్లా పంచాయతీ అధికారి

చిత్రంలో జిల్లా పంచాయతీ అధికారి. జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే30:జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామపంచాయతీ కార్యాలయం తో పాటు గ్రామపంచాయతీ చేసిన అభివృద్ధి పనులను జిల్లా పంచాయతీ అధికారి ఏ రవీందర్ గురువారం సందర్శించారు. గురువారం స్థానిక ఎంపీవో సతీష్ కుమార్ విలాసాగర్ గ్రామపంచాయతీ కార్యదర్శి మనోహర్ రెడ్డి తో కలిసి గ్రామంలో ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి వనం,కంపోస్టు షెడ్,వైకుంఠ ధామం,నర్సరీ, క్రీడా ప్రాంగణాల ను జిల్లా పంచాయతీ అధికారి తనిఖీ చేశారు. గ్రామపంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన వివిధ … Read more

జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే29:జమ్మికుంట పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ హుజరాబాద్ డివిజన్ కమిటీ అధ్యక్షులు సౌడమల్ల యోహాన్ అధ్యక్షతన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు తిరుపతిరెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా అధ్యక్షులు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారి యొక్క ముఖ్య డిమాండ్ అయిన హెల్త్ కార్డు,నివేషణ స్థలాలు,రైల్వే పాసులను పునరుద్దించలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఫోర్త్ స్టేట్ అని చెప్పుకునే జర్నలిస్టులకే రక్షణ లేకుండా పోతుందని ప్రజలకు ప్రభుత్వానికి … Read more

ఇల్లందకుంట రామాలయానికి వెలిచాల విరాళం

ఇల్లందకుంట(ధనాధన్ న్యూస్)మే28:కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలకేంద్రంలోని రామాలయానికి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు  విరాళం ప్రకటించారు. అపర భద్రాద్రిగా పేరు గాంచిన సీతారామచంద్రస్వామి దేవస్థాన అభివృద్ధికి కాంగ్రెస్ నాయకుడు వెలిచాల రూ.2 లక్షల నగదును మంగళవారం అందజేశారు.

ప్రభుత్వ భూమి కబ్జా పై జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే27:జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారంలోని సర్వే నెం. 368 కుంట శిఖం భూమి 0-33 గుంటలు కబ్జాదారుల బారి నుండి కాపాడాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి జమ్మికుంట మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ బొంగోని వీరన్న ఫిర్యాదు చేశారు.ధర్మారం గ్రామంలోని సర్వే నెం 368 లో 0-33 గుంటల కుంట శిఖం భుమి ఉండగా మధ్యలో నుండి 1965లో  ఆర్&బి రోడ్డు జమ్మికుంట నుండి వావిలాల వరకు పోయింది.అప్పటి నుండి ఆ కుంట ఖాళీగా … Read more