బస్ డిపోలో కార్తీక మాస వనబోజనాలు

By dhanadhannews.com

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ పట్టణ కేంద్రంలోని స్థానిక బస్ డిపోలో గురువారం రోజున కార్తీక మాస వనబోజన కార్యక్రమంలో భాగంగా  ఆర్టీసీ మరియు పీహెచ్బీ ఉద్యోగులందరు ఒక్కచోట చేరి పలురకాల ఆటలు,పాటల  పోటీ నిర్వహించి విజేతలను ఎంపిక చేశారు.అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిపో మేనేజర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ కార్యక్రమం ఉద్యోగులందరి మానసిక ఉత్సాహం కోసం ఆర్టీసీ ఈ కార్యక్రమంను ఆర్టీసీ ఎండి సజ్జనార్ కార్తీకమాస వన భోజన కార్యక్రమం   రెండు రోజులు నిర్వహించాలనే ఆదేశాల మేరకు , ఉద్యోగులందరూ ప్రతిరోజు వారి పనిలో నిమగ్నమై ఎంతో కృషి చేస్తున్నారని వారి యొక్క మానసిక ఉల్లాసం కోసం,కాస్త కొన్ని గంటలైనా వారి బాధలను మరిచిపోయి ఉల్లాసంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని,ఈ కార్యక్రమంలో ఆటల పోటీలో,పాటల పోటీలు నిర్వహించి గెలిచిన వారికి డిఎం చేతుల మీదుగా బహుమతులు అంద చేయడం జరిగింది,ఈ కార్యక్రమానికి వచ్చి కష్టపడి ఎడీసీలు,సూపర్వైజర్లు ఉద్యోగులు, అందరూ కలిసి కలిసికట్టుగా విజయవంతంగా జరుపుకొని రుచికరమైన వంటకాలను హరగించడం జరిగిందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి  కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ రవీంద్రనాథ్, సూపర్డెంట్ నజీరుద్దీన్, మెక్ సూపర్వైజర్ సమ్మయ్య, ట్రాఫిక్ సూపర్వైజర్ సారయ్య, సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.