తాజా వార్తలు
మీ తాటాకు సప్పుళ్లకు బయపడేటోళ్ళం కాదు
జమ్మికుంట/ధనాధన్ న్యూస్:జమ్మికుంట పట్టణంలో శనివారం కాంగ్రెస్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ మేడిపల్లి రవీందర్ చేసిన పత్రికా ప్రకటనలో తమపై చేసిన ఆరోపణలను జమ్మికుంట పట్టణ బిజెపి అధ్యక్షుడు కొలకాని రాజు ఖండించారు. వాట్సాప్ గ్రూపులో నిధులు తానే తెచ్చుకున్నట్టు చెప్పుకున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేయడం పూర్తిగా తప్పుడు వాదమని ఆయన స్పష్టం చేశారు. కొలకాని రాజు మాట్లాడుతూ – “మేము బిజెపి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పలుమార్లు మున్సిపల్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రాలు సమర్పించామని, స్పందన … Read more
గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాలి
కరీంనగర్/ధనాధన్ న్యూస్, సెప్టెంబర్ 4 : హుజురాబాద్ డివిజన్ పరిధిలో గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎటువంటి అవాంతరాలు లేకుండా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సూచించారు. హుజురాబాద్ ఏసీపీ కార్యాలయంలో పోలీస్, విద్యుత్, వైద్య, మున్సిపల్, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ, నిమజ్జన ప్రదేశాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని, బారికేడ్లు, సరైన లైటింగ్, క్రేన్లు, అదనపు డ్రైవర్లు … Read more
కల సౌకర్యాలతో మహా మేడారం జాతర – మంత్రి సీతక్క
హైదరాబాద్, సెప్టెంబర్ 03:సమ్మక్క–సారలమ్మల త్యాగ ఔన్నత్యానికి తగిన వేడుకగా మేడారం మహా జాతరను నిర్వహిస్తామని మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రకటించారు. జాతర ప్రారంభానికి ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ఉన్నతాధికారులు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్, వివిధ విభాగాల ఇంజనీర్లు పాల్గొన్నారు. సమ్మక్క–సారలమ్మ పూజారుల సూచనల మేరకు … Read more
ఆకునూరులో అన్నదానం
సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూరు గ్రామంలో వాయుపుత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అన్నదాత గుర్రాల సంజీవ్ ఉమా దంపతులు మాట్లాడుతూ గ్రామ ప్రజల సుఖసంతోషాల కోసం, అష్ట ఐశ్వర్యాలు, సిరిసంపదలు లభించాలని గణనాధుని ప్రార్థించామని తెలిపారు.అన్నదానం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాయుపుత్ర యూత్ అసోసియేషన్ సభ్యులు, ఆకునూరు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
యూత్ కాంగ్రెస్ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా రాఘన్
సైదాపూర్/ధనాధన్ న్యూస్:యూత్ కాంగ్రెస్ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా రాఘన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాఘన్‌ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఏఎంసీ డైరెక్టర్ చోటే మియా మాట్లాడుతూ – రాఘన్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ, కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విశేష కృషి చేశారని అన్నారు. రాఘన్ ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ ఎండీ చోటే మియా, పల్లె గోపాల్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ … Read more
సైదాపూర్‌లో బిఆర్ఎస్ ధర్నా, రాస్తారోకో
సైదాపూర్, సెప్టెంబర్ 2 (ధనాధన్ న్యూస్):సైదాపూర్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం భారీ స్థాయిలో ధర్నా, రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సోమారపు రాజయ్య మాట్లాడుతూ –రైతులు యూరియా కోసం రోజుల తరబడి క్యూల్లో నిలబడుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని తీవ్ర విమర్శలు చేశారు. వారానికి ఒక్కటి రెండు లారీలు యూరియా సరఫరా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై … Read more
జమ్మికుంటలో ఎరుకల జాతి ఆత్మగౌరవ పోరాట జెండా ఆవిష్కరణ
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణ పరిధి 16వ వార్డులోని ఎస్టీ కాలనీలో ఆదివారం ఎరుకల కులస్తుల సమక్షంలో ఎరుకల జాతి ప్రజల ఆత్మగౌరవ పోరాట జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తిరుపతి శ్రీనివాస్ మాట్లాడుతూ,1952 ఆగస్టు 31న క్రిమినల్ ట్రైబ్స్ (CT Act) రద్దు చేయబడిన దినాన్ని పురస్కరించుకొని ఈ జెండా ఆవిష్కరణ చేపట్టినట్లు తెలిపారు. బ్రిటిష్ పాలకులు ఎరుకల తెగల అడవి సంపదను దోచుకోవడానికి కుట్రలు పన్ని, వారి ప్రతిఘటనను అణచివేయడానికి ఈ చట్టాన్ని అమలు … Read more
జమ్మికుంటలో గణేష్ నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారుల సూచనలు
జమ్మికుంట,ధనాధన్ న్యూస్ ఆగస్టు 26:రేపటి నుంచి ప్రారంభమయ్యే గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని జమ్మికుంట పట్టణంలో అధికారులు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. ఈ రోజు జమ్మికుంట టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్. రామకృష్ణ, మండల తహసీల్దార్ (ఎం.ఆర్.వో), మున్సిపాలిటీ సిబ్బంది,ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు సమావేశమై ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ గణేష్ మండపాల వద్ద విద్యుత్ వైరింగ్‌ను తప్పనిసరిగా లైసెన్స్ పొందిన ఎలక్ట్రీషియన్ ద్వారానే చేయాలని స్పష్టం చేశారు. వైరింగ్‌లో … Read more
తప్పుడు పత్రాలతో అధికారులను మోసం
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: తప్పుడు పత్రాలు సృష్టిస్తూ అధికారులను మోసం చేస్తూ దొంగే దొంగ అన్నట్టుగా వ్యవహరిస్తున్న భూ కబ్జాదారులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని కోరపల్లి మాజీ సర్పంచ్ బోయిని సమ్మయ్యఅన్నారు .మంగళవారం జమ్మికుంట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోఆయన మాట్లాడుతూ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తనను మానసికంగా హింసిస్తున్నారని, ప్రజల్లో తనను ఒక తప్పుడు వ్యక్తిగా సూచిస్తున్నారని పలువురు ప్రజాప్రతినిధులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు .దళితుడైన తనను కొంతమంది కావాలని … Read more