సైదాపూర్‌లో బిఆర్ఎస్ ధర్నా, రాస్తారోకో

సైదాపూర్, సెప్టెంబర్ 2 (ధనాధన్ న్యూస్):సైదాపూర్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం భారీ స్థాయిలో ధర్నా, రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సోమారపు రాజయ్య మాట్లాడుతూ –రైతులు యూరియా కోసం రోజుల తరబడి క్యూల్లో నిలబడుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని తీవ్ర విమర్శలు చేశారు. వారానికి ఒక్కటి రెండు లారీలు యూరియా సరఫరా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై … Read more

బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్

హైదరాబాద్, సెప్టెంబర్ 2:భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీకి అనుబంధంగా ఉన్న ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘన, పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు. సస్పెన్షన్ వెనుక కారణాలు ఇటీవల కాలంలో కవిత పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రవర్తించారని, పార్టీకి ఇబ్బందులు కలిగించే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. క్రమశిక్షణలో లోపం ప్రదర్శించినందుకు … Read more

ఆదివాసి ఎరుకల కులస్తులకు అండగా ఉంటాం

వరంగల్/ధనాధన్ న్యూస్: బిఆర్ఎస్ పార్టీ రజతోఉత్సవ సభ పరిశీలన సందర్భంగా వరంగల్ మీదుగా ఎలుకతుర్తికి వచ్చిన కే కవితక్కని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున ఆదివాసి ఎరుకల సమస్యల పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు  ( నాంచారమ్మ )  ఎరుకల బుట్టను ఇచ్చి  స్వాగతం  పలికారు.కవితక్క  ఆదివాసి ఎరుకల జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ గత కేసీఆర్ … Read more

బిఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు స్వచ్ఛందంగా లక్షలాదిగా తరలి రావాలి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: బిఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు గ్రామ గ్రామాల నుంచి స్వచ్ఛందంగా లక్షలాదిగా తరలి రావాలనీ బిఆర్ఎస్ కొత్తపల్లి మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు ఆకుల రవీందర్ పటేల్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ రజతోత్సవ సభ కానీ విని ఎరుగని రీతిలో జరగనుందని రవీందర్ పటేల్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 27న జరగనున్న ఎల్కతుర్తి బిఆర్ఎస్ రజతోత్సవ సభలో కెసిఆర్ మాటల కోసం అన్ని వర్గాల ప్రజలంతా … Read more

అపార్‌ ఐడీ నమోదు వేగవంతం చేయాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: ప్రతి విద్యార్థి యొక్క అపార్‌ ఐడీ వివరాలను యూడైస్‌ ప్లస్‌లో నిక్షిప్తం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని జమ్మికుంట ఇంచార్జ్ మండల విద్యాధికారి మంతెన హేమలత  పాఠశాలల, కళాశాలల ప్రిన్సిపాల్ లను ఆదేశించారు.. మంగళవారం జమ్మికుంట పట్టణంలోని  ప్రభుత్వ, ప్రైవేట్‌ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, కళాశాలలు సందర్శించారు..ఈ సందర్భంగా మండల విద్యాధికారి హేమలత మాట్లాడుతూ ఒక విద్యార్థి ఒక దేశం అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన యూడైస్‌ ప్లస్‌ విధానంలోకి విద్యార్థుల వివరాలను … Read more

జాతీయజెండాను అవమాన పరిచిన పంచాయతీ కార్యదర్శి

సైదాపూర్ మండలంలోని సోమవారం గ్రామపంచాయతీ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించే క్రమంలో జెండా ఊడి నేలపై పడింది.గ్రామ పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం ద్వారానే జాతీయ జెండా ఆవిష్కరించే క్రమంలో నేలపై పడ్డది అని జాతీయ జెండా అవమాన పరిచిన పంచాయతీ కార్యదర్శి ఊసకోయిల రాజీవ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ ని కోరారు.పంచాయతీ కార్యదర్శి రాజీవ్ మండలంలోని సీనియర్ నాయకుడి కి కుటుంబ సభ్యుడు కావడం వల్ల,ఏం జరిగినా ఆయన చూసుకుంటాడనే ధోరణి తో తన … Read more

గ్రామ సభ విజయవంతానికి సహకరించాలి

సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో నూతనంగా ఏర్పడిన గర్రెపల్లి  గ్రామ పంచాయతీ ఆవరణంలో గురువారం చేపట్టనున్న మొట్టమొదటి గ్రామ సభను ప్రజలు విజయవంతం చేయాలని అదే గ్రామానికి చెందిన దోకిడి తిరుపతి తెలిపారు.ప్రజల ఇన్ని నాళ్ల కల ఈరోజు తొలి గ్రామపంచాయతీ ఏర్పడడం ద్వారా తీరిందని తెలిపారు.ఇన్నాళ్లు సోమారం గ్రామానికి అనుబంధంగా గర్రెపల్లి గ్రామం ఉందని ఇప్పుడు కొత్తగా గ్రామపంచాయతీ ఏర్పాటుతో ఆనందం వ్యక్తం చేశారు.గ్రామంలోని ప్రజలు అర్హులైన ప్రతి ఒక్కరు ఇంటి నిర్మాణం … Read more

నువ్వు మొగోడివి అయితే.. రాజీనామా చేసి మళ్ళీ గెలువు

ఫైల్ ఫోటో హుజురాబాద్/ధనాధన్ న్యూస్: జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పై బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన దాడిని ఖండిస్తున్నట్లు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.వారు మాట్లాడుతూ పదేళ్లపాటు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి చిల్లర పనులు ఏరోజు చేయలేదని పార్టీ ఫిరాయింపులపై గగ్గోలు పెట్టే ఎమ్మెల్యే తను ఏ పార్టీ నుంచి ఫిరాయించి బిఆర్ఎస్ లో చేరాడో తెలుసుకోవాలని సూచించారు.సంవత్సరం గడుస్తున్నా కౌశిక్ రెడ్డికి అధికారం మదం … Read more

ఎమ్మెల్యే పై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: సహాచర జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు హేయమైన చర్య అని హుజురాబాద్ కాంగ్రెస్ శ్రేణులు అన్నారు.ఈ మేరకు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ లో అతనిపై ఫిర్యాదు చేశారు.కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రులు,ఎమ్మెల్యేల పట్ల కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు,వాడిన పదజాలం సరిగా లేదని ప్రజా సమస్యల పట్ల … Read more

మా గ్రామాన్ని పట్టించుకోండి మంత్రి గారు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: పాలకులు మారినా…ప్రభుత్వాలు మారినా…ప్రజల ఇబ్బందులు తప్పడం లేదు…కొత్త గ్రామపంచాయతీగా ఆవిర్భవించిన గర్రెపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యము లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యంతో పాటు గ్రామంలో రేషన్ షాపు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దోకిడి తిరుపతి అన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…హుస్నాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయంపై ప్రత్యేకమైన  … Read more