రైతు ఉత్సవాల పేరుతో ‘అన్నదాత’కు అవమానం

సిద్దిపేట/ధనాధన్ న్యూస్:ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘రైతు ఉత్సవాలు’ క్షేత్రస్థాయిలో అభాసుపాలవుతున్నాయి. ఆధునిక సాంకేతికతపై అవగాహన కల్పిస్తామంటూ హుజూరాబాద్ నియోజకవర్గ రైతులను సిద్దిపేటకు తరలించిన అధికారులు, కనీసం వారికి సరైన భోజన వసతి కల్పించడంలో విఫలమయ్యారు. అధికారుల అతి ఉత్సాహం, నిర్లక్ష్యంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు అప్పని హరీష్ వర్మ మాట్లాడుతూ రైతు ఉత్సవాల పేరుతో పిలిచి రైతులను అవమాన పరిచారని ఆవేదన వ్యక్తం … Read more

జై భీమ్ కాలనీలో ఎస్సీ కమిటీ ఏర్పాటు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు జై భీమ్ కాలనీలో యువతలో మంచి మార్పు తీసుకురావడం, సమాజంలో పోటీ తత్వం పెంపొందించడం, చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా ప్రోత్సహించడం లక్ష్యంగా నూతనంగా ఎస్సీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల ఎన్నికైన కౌన్సిలర్ సురంజన్ ని ఘనంగా సన్మానించారు. అదే వేదికపై కమిటీకి ఎన్నికైన సభ్యులను కూడా కౌన్సిలర్ సురంజన్ ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. … Read more

గురువు ఆశీస్సులతో ప్రజాసేవ బాటలోకి అరికిల్ల స్రవంతి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం శిష్యురాలు అరికిల్ల స్రవంతి తన రాజకీయ ప్రయాణంలో మరో కీలక అడుగు వేశారు.జమ్మికుంట మున్సిపాలిటీ 24వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంగా శనివారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తన రాజకీయ గురువు ప్రొఫెసర్ కోదండరాంను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ,జనసమితి పార్టీ ఆవిర్భావం నుంచే స్రవంతి పార్టీకి వెన్నెముకలా నిలిచిందని అన్నారు.కార్యకర్త స్థాయి నుంచి ప్రారంభమైన … Read more

జర్నలిస్టులను అరెస్టు చేయడం అన్యాయం

టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కోకన్వీనర్ కే బాపురావు కరీంనగర్/ధనాధన్ న్యూస్:ఎన్టీవీ మీడియాలో ఒక మహిళా ఐఏఎస్ అధికారిపై ప్రసారమైన కథనంపై ఎటువంటి విచారణ చేయకుండా, ముందస్తు నోటీసు ఇవ్వకుండా సిట్ పోలీసులు ఓ ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) తీవ్రంగా ఖండించింది. ఎన్టీవీలో వచ్చిన కథనానికి జర్నలిస్టులు దొంతు రమేశ్, పరిపూర్ణ చారి, సుధీర్ లను బాధ్యులను చేస్తూ ‘సిట్’ పోలీసులు ముందస్తునోటీసులు ఇవ్వకుండా నేరుగా అరెస్టు చేయడం దారుణమని … Read more

సీనియర్ జర్నలిస్ట్ మండల యాదగిరికి
రాష్ట్రస్థాయి సర్వోత్తమ సేవ పురస్కారం

హుజురాబాద్ /ధనాధన్ న్యూస్:కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ మండల యాదగిరిని రాష్ట్రస్థాయి సర్వోత్తమ సేవ పురస్కారంతో ఘనంగా సత్కరించారు. గత 30 సంవత్సరాలుగా పత్రికా రంగంలో ఆయన అందిస్తున్న నిస్వార్థ, విశిష్ట సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు.మానవ విలువల పరిరక్షణ సేవా సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ప్రజాకవి నాగుల సత్యం గౌడ్ ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతి మెయిన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పలు … Read more