యూనిఫార్మ్స్ కుట్టుట వేగవంతం చేయండి

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే27:హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫార్మ్స్ కుట్టు కేంద్రాలను సోమవారం మెప్మా పిడి స్వరూప రాణి, కమీషనర్ మొహమ్మద్ అయాజ్,డిఎంసి శ్రీవాణి, ఏడిఎంసి మల్లీశ్వరిలు పరిశీలించారు.అనంతరం పలు కేంద్రాలను పరిశీలించి,యూనిఫార్మ్స్ నాణ్యతగా ఉండేలా ప్రభుత్వం ఇచ్చిన సూచనలతో కుట్టాలని,యూనిఫార్మ్స్ కుట్టుట వేగవంతం చేయాలని వారిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మెప్మా అధికారులు సతీష్,సీఎల్ఆర్పీలు జ్యోతి, మంజుల,ఆర్పీలు,కుట్టు మిషన్ నిర్వాహుకురాలు అభేద భాను లతో పలువురు పాల్గొన్నారు.

ఖబర్దార్ కేటీఆర్

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే25:మొన్న డిసెంబర్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కేటీఆర్ కు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినప్పటికీ ఇంకా అహం తగ్గలేదని, వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల స్థానానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సామాన్యుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి అసామాన్యుడిగా ఎదిగిన తీన్మార్ మల్లన్నను చూసి ఓర్వలేక ” మీకు బిట్స్ పిలానీ కావాలా.. పల్లి బఠాణి కావాలా..! అంటూ మల్లన్నను ఉద్దేశించి హేళన చేస్తూ మాట్లాడిన కేటీఆర్ ఒళ్ళు … Read more

భూ ఆక్రమణలపై కలెక్టర్ కు పిర్యాదు

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే25:సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిని మాజీ సర్పంచ్ తన కుటుంబ సభ్యుల పేరున అక్రమ పట్టా చేసి ఆక్రమించుకున్నాడని గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ కి పిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే గ్రామ శివారు లోని మసీదు దగ్గర భూమిని పూర్వం అంబేద్కర్ భవనం,ప్రాథమిక పశువుల వైద్యశాలకు కేటాయించిన  భూమిని ఇందిరా సుధీర్ కుమార్ గౌడ్ సర్పంచ్ పదవిలో కొనసాగుతూ తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి సర్వేనెంబర్ 399/ఆ  లో సుమారు … Read more

నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)మే24:వర్షాకాలం వస్తుండడంతో రైతులు దుక్కి దున్ని పంట సాగుచేయడానికి విత్తనాలు ఎప్పుడు వస్తాయా పంట ఎప్పుడు వేయాలా అని ఎదురుచూస్తూ ఉంటారని,రైతుల అవసరాన్ని ఆసరా చేసుకునే కొందరు నకిలీ విత్తనాలు రైతులకు అమ్మి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తారని రైతులు జాగ్రత్తగా ఉండాలని హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ తెలిపారు.హుజురాబాద్ లోని ఏసీపీ కార్యాలయం లో డివిజన్ లోని పోలీస్ అధికారులతో కలిసి జై కిసాన్ పోస్టర్ ని ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఏసీపీ శ్రీనివాస్ జీ … Read more

ఉపాధిహామీ కూలీలకి యోగ శిక్షణ

మహాముత్తారం(ధనాధన్ న్యూస్)మే22:మహాముత్తారం మండలంలోని పెగడపల్లి గ్రామంలో జాతీయ ఉపాధిహామీ కూలీలకి జాతీయ యోగ శిక్షణ అధ్యాపకుడు వావిల్ల కిష్టయ్య శిక్షణ ఇస్తూ యోగ వలన జరిగే ప్రయోజనాలను కూలీలకి వివరించడం జరిగింది.ప్రతిరోజూ ఐదు నిమిషాలు ధ్యానం చేయడం వలన మనిషిని పట్టిపిడిస్తున్న  సైకో సోమటిక్ వ్యాధులు మానసిక వ్యాధులు భయం, కోపం,భద్రత భావము మొదలైన వ్యాధులను నయం చేయవచ్చునని,కరోన,గుండె సంబంధిత వ్యాధులు ధ్యానం తో నయం చేయవచ్చునని ఉపాధి హామీ కూలీలకి పని సామర్ధ్యమును పెంచడంతో పాటు … Read more

పట్టభద్రులారా తీన్మార్ మల్లన్న కి పట్టం కట్టండి

పరకాల(ధనాధన్ న్యూస్)మే 21:కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించేందుకు పట్టభద్రుల ఓటర్లను నాయకులు,కార్యకర్తలు స్వయంగా కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేసి మల్లన్నను పరకాల నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని ఎమ్మెల్సీ ఎన్నికల పరకాల నియోజకవర్గ కోఆర్డినేటర్ వొడితల ప్రణవ్ పిలుపునిచ్చారు.మంగళవారం పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశానుసారము పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కో-ఆర్డినేటర్ వొడితల ప్రణవ్ పరకాల పట్టణ మరియు … Read more

ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే21:సైదాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నవ భారత నిర్మాత నవ యువతకు స్ఫూర్తి మాజీ ప్రధాని,భారత రత్న స్వర్గీయులు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమశాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్  ఆదేశాల మేరకు సైదాపూర్ మండల కేంద్రంలో కొత్త బస్ స్టేషన్ అవరణలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంత సుధాకర్  ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూల మల వేసి ఘన నివాళి అర్పించడం … Read more

అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులను ఆదుకోవాలి

కరీంనగర్(ధనాధన్ న్యూస్)మే18:గత రెండు రోజుల నుండి రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యం కారణంగా అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని  ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి పైడిపల్లి రాజు ఒక ప్రకటనలో శనివారం  ప్రభుత్వాన్ని కోరారు.  ఈ సందర్భంగా పైడిపల్లి రాజు మాట్లాడుతూ మార్కెట్ కల్లాలలో,ఐకెపి కేంద్రాలలో  ఉన్న ధాన్యం పూర్తిగా తడిసి పోయిందని, పండ్ల తోటలు మామిడి,సపోటా బొప్పాయి తదితర కాయలు ఈదురు గాలులకు నేలమట్టమై తీవ్ర నష్టం వాటిలిందని  ఆయన పేర్కొన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం  … Read more

ప్రమాదంలో గాయపడిన వారికి సహాయచర్యలు అందించిన ప్రణవ్

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే13:జమ్మికుంట మండలం తనుగుల గ్రామంలో ని మూల మలుపు వద్ద చెట్టును కారు ఢీ కొట్టిన ఘటన లో భార్యభర్తలకు తీవ్రగాయాలయ్యాయి.వరంగల్ నుండి కాల్వశ్రీరాంపూర్ మండలం బేగంపేటకు గ్రామానికి ఓటు వేయడానికి వెళుతున్న శ్రీనివాస్-రమ దంపతుల కారు తనుగుల గ్రామంలోని మూలమలుపు వద్ద చెట్టుని డీకొట్టింది.కారు లో ప్రయాణిస్తున్న భార్యభర్తలతో పాటు చిన్న పాప కి గాయాలయ్యాయి.ఆ సమయం లో వావిలాల నుండి పోలింగ్ కేంద్రాలను పరిశీలించి వస్తున్న హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితల … Read more

అక్రమ మట్టి తరలింపుపై చర్యలేవి

ఇల్లందకుంట(ధనాధన్ న్యూస్)మే12:ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన చెరువులో కంచె గోవర్ధన్ అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చెర్లమట్టిని గృహాలకు తరలిస్తున్నారు.ఈ విషయమై మండలాధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కానీ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఫిషర్ మెన్ చైర్మన్ బండి మల్లేష్ అన్నారు.కనగర్తి గ్రామానికి చెందిన చెర్లు కుంటలను 2022 నుండి రెండు సంవత్సరాలుగా దొంగతనంగా చెరువులోని మట్టిని అమ్ముకుంటూ అధికారులను రాజకీయ పార్టీ నాయకులకు ముడుపులు … Read more