కేంద్ర బిజెపి ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలం ఆపాలి

కరీంనగర్/ధనాధన్ న్యూస్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలం పాట ఆపాలని,సింగరేణి సంస్థకే నేరుగా కేటాయించాలని సిపిఎం కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు.సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గీతా భవన్ చౌరస్తాలో శనివారం రోజున ప్లకార్డులతో నిరసనచేశారు.కేంద్ర బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి  మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకును కేంద్ర బీజేపీ ప్రభుత్వం వేలం వేస్తున్నదని … Read more

వైద్య విద్యకు పేద విద్యార్థులను దూరం చేసే కుట్ర

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన నీట్ పేపర్ లీకేజీ పై బిఆర్ఎస్వి జమ్మికుంట టౌన్ అధ్యక్షులు కొమ్ము నరేష్ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.అనంతరం బిఆర్ఎస్వి నాయకులు కొమ్ము నరేష్,హరీష్ వర్మ అప్పని మాట్లాడుతూ 24 లక్షల వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు.గత 20 రోజులుగా విద్యార్థులు,విద్యార్థి తల్లిదండ్రులు ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలు చేసిన నిమ్మకునీరెత్తనట్లుగా రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని అన్నారు.ఈ రాష్ట్రంలో 70 వేల … Read more

అలరించిన బాలసభ

జమ్మికుంట/ధనాధన్ న్యూస్:జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్తపల్లి లో జరిగిన బాలసభ సాంస్కృతి కార్యక్రమాలు అందరిని అలరించాయి.తెలంగాణ ప్రభుత్వము విద్యాశాఖ వారు విద్యార్థులను సాంస్కృతికంగా సాహిత్య పరంగా అభివృద్ధిపరిచేందుకై ప్రతినెల నాలుగవ శనివారము ‘నో బ్యాగు డే’ను నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థుల్లో ఉన్న సృజణాత్మకత శక్తులను వెలికి తీసేందుకు ఈ కార్యక్రమము ఉపకరిస్తుందని విద్యార్థిని విద్యార్థులు బాలసభను ఉపయోగించుకొని చక్కటి సాంస్కృతిక నిర్వహించాలని కవితలు,గేయాలు,పాటలు వినిపించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు చేసిన దేశభక్తి … Read more

పీఎం కిసాన్ యోజన రైతులకు ఓ వరం

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)జూన్15: రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన ఓ వరం లాంటిదని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. ఈనెల 18న ప్రధాని మోదీ కిసాన్ సమ్మేళన్ ప్రోగ్రాం నేపథ్యంలో  జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం లో వర్చువల్ గా జరిగే  ప్రోగ్రాం ఏర్పాట్లను స్థానిక బిజెపి శ్రేణులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 18న వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతున్న కిసాన్ సమ్మేళన్ ప్రోగ్రాం … Read more

చేగువేరా స్పూర్తితో యువత ఉద్యమించాలి

కరీంనగర్(ధనాధన్ న్యూస్)జూన్14: సామ్రాజ్యవాదుల గుండెల్లో దడ పుట్టించిన విప్లవ దృవతార చేగువేరా అని,ఆయన ఉద్యమ పోరాట స్పూర్తితో నేటి విద్య, ఉపాధి,ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పాలకులపై ఉద్యమించాలని యుగంధర్ పిలుపునిచ్చారు.శుక్రవారం కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్  ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో చేగువేరా 96వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి పూలమాలలు వేశారు.ఈ సందర్భంగా ఎఐవైఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రాహ్మండ్ల పెళ్లి యుగంధర్  మాట్లాడుతూ 1928 జూన్ 14న అర్జెంటీనాలో జన్మించిన చేగువేరా వైద్య, ఇంజనీరింగ్  విద్యలను … Read more

ఘనంగా మడేలయ్య స్వామి బోనాలు

సైదాపూర్(ధనాధన్ న్యూస్)జూన్13: రజకుల కుల ఆరాధ్య దైవమైన శ్రీమడేలయ్య స్వామి జాతరను కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామంలో గురువారం రజకులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రతి గడప నుండి మహిళలు బోనం ఎత్తుకొని డప్పుచప్పుళ్లు శివసత్తుల పూనకాల మధ్య పురవీధుల గుండా  గ్రామ శివారులోని ఆలయానికి చేరుకొని మడేలయ్య స్వామికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని,వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని స్వామివారిని వేడుకున్నారు.మడలేయ్య స్వామి జాతరకు  ఆలయాన్ని … Read more

కౌశిక్ రెడ్డిని విమర్శించే స్థాయి ప్రణవ్ ది కాదు

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)జూన్13: హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ ని విమర్శించే స్థాయి ప్రణవ్ కి లేదని బీఆర్ఎస్ సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి అన్నారు. గురువారం హుజరాబాద్ లోని ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వారం రోజులుగా ఫ్లై యాష్ స్కాం గురించి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంత్రి కనుసన్నలోనే స్కామ్ జరుగుతుంది అని ఆధారలతో నిరూపిస్తే ఇప్పటివరకు మంత్రి ఎందుకు స్పందించడం లేదని … Read more

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

సైదాపూర్(ధనాధన్ న్యూస్)జూన్12:ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని అందుకోసం ప్రభుత్వాలు సకల సౌకర్యాలు అందిస్తున్నట్లు ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి తెలిపారు.విద్యా సంవత్సరం ప్రారంభ రోజును పురస్కరించుకుని మండల కేంద్రంలోని వెన్కెపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం రోజున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా విద్యార్థులకు స్కూల్ యూనిఫాం లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ఆది నుండి నేటి … Read more

బడి బాటకి విస్తృత ప్రచారం

సైదాపూర్(ధనాధన్ న్యూస్)జూన్10:సైదాపూర్ మండల కేంద్రంలోని వెన్కేపల్లి ఉన్నత పాఠశాల ఉపాద్యాయులు మండలంలోని సైదాపూర్,వెన్కేపల్లి,జాగిరిపల్లి,గర్రెపల్లి,ఘనపూర్,బొత్తలపల్లి, రామచంద్రాపూర్,కురుమపల్లి,దుద్దేనపల్లీ గ్రామాలలో ఇంటింటా తిరుగుతూ విద్యార్థులకు, ఉపాధ్యాయులు ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా ఉపాద్యాయులు విస్తృత ప్రచారం చేస్తు అవగాహన కల్పిస్తున్నారు.ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన ఉచిత విద్యతో పాటు, డిజిటల్  విద్యాబోధన,అత్యాధునిక సౌకర్యాలు,ఉచిత పుస్తకాలు,సన్నబియ్యంతో నాణ్యమైన ఉచిత మధ్యాహ్న బిజనంతో పాటు యునిఫాం ఇస్తున్నట్లు ఉపాద్యాయులు చెబుతున్నారు.ఈ విద్యాసంవత్సరం వెన్కేపల్లి పాఠశాలలో 10వ తరగతిలో 100శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వివరించారు.మానసిక … Read more

విద్యుత్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా మోతే శ్రీనివాస్ ఎన్నిక

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)జూన్07:హుజురాబాద్ పట్టణంలో  1104 విద్యుత్ ఉద్యోగుల సంఘం డివిజన్ స్థాయి ఎన్నికలు శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగాయి.విద్యుత్ ఉద్యోగుల సంగం డివిజన్ అధ్యక్షునిగా మోతే శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి గా డి.శంకర్,వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహేశ రవి,అడిషనల్ సెక్రటరీ గా అశ్వంత్ కుమార్ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా డివిజన్ స్థాయి అధ్యక్షునిగా ఎన్నికైన మోతే శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల కోసం నిరంతరం కృషి చేస్తానని, బదిలీ విషయాలలో నిష్పక్షపాతంగా అందరితో చర్చించి సమన్వయంగా కృషి చేస్తానని తెలిపారు. తనను … Read more