శ్రీ సీతారాముల కళ్యాణం..కనులవిందు

పట్టు సమర్పిస్తున్న కలెక్టర్ పమేలా సత్పతి. జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 17:అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం గురువారం కమనీయం రమణీయంగా జరిగింది.సీతా రామచంద్రస్వామి ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి మేళ తాళాల మధ్య వేదపండితుల వేదమంత్రోచరణ మధ్య ఎదుర్కోళ్ల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.రాష్ట్ర ప్రభుత్వం తరఫున కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి దంపతులు, హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి పట్టు వస్త్రాలను ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. … Read more

స్పందన అనాధాశ్రమంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని స్థానిక పోలీస్ వారి సహకారంతో సామాజిక కార్యకర్త,  అంబాల రజనీకాంత్ ఆధ్వర్యంలో,ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత మహనీయుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిపించడం జరిగింది ఈ సందర్భంగా   స్పందన పిల్లల అనాధాశ్రమంలో పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి పిల్లలందరికీ  నోట్ బుక్కులు,పెన్నులు ఫ్రూట్స్ పంపిణీ చేసి పిల్లలకు అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని తను పేద బడుగు బలహీన వర్గాలకు చేసిన తన త్యాగాన్ని గుర్తు చేస్తూ పిల్లలు … Read more

దళిత సమ్మేళనాన్ని విజయవంతం చేయండి

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 11:హుజూరాబాద్ పట్టణ కేంద్రంలోని శిశు మందిర్ లో బీజేపీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు కొంకటి  రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్సీ మోర్చా సమావేశానికి ముఖ్య అతిథి గా కరీంనగర్ పార్లమెంట్ ఎస్సి మోర్చా ఎన్నికల కన్వీనర్ జాడి బాల్ రెడ్డి హాజరయ్యారు.మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులు అర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెలలో కరీంనగర్ పార్లమెంట్ స్థాయిలో ఎస్సి మోర్చా దళిత సమ్మేళనం నిర్వహిస్తామని ఈ కార్యక్రమానికి జాతీయ … Read more

స్పందన అనాధాశ్రమంలో ఘనంగా సామూహిక జన్మదిన వేడుకలు

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 09:జమ్మికుంట మండల కేంద్రంలో 2024 ఉగాది పండుగ పురస్కరించుకొని సామాజిక కార్యకర్త, ఫెర్టిలైజర్ ప్రైవేట్ ఎంప్లాయిస్ యూనియన్ మండల అధ్యక్షుడు అంబాల రజనీకాంత్ ఆధ్వర్యంలో తన మిత్ర బృంద సభ్యులతో కలిసి మంగళవారం స్పందన పిల్లల అనాధాశ్రమంలో అనాధ పిల్లల సామూహిక జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.అనంతరం పిల్లలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి,ఫ్రూట్స్,బ్రెడ్స్ ప్యాకేట్స్ అందజేశారు.ఈ కార్యక్రమంలో గోపాల్ రావు,తిరుపతి,జూపాక సందీప్,వోల్లలా శ్రీకాంత్,సంపంగి రాకేష్,రాజు,మహంకాళి శివ,దొడ్డె రాజు,మ్యాడగని సురేష్,పులల సురేష్,రాజు,అనిల్,మిడిదొడ్డి సాయిరాం,సాయి,అభి తదితరులు పాల్గొన్నారు

మున్నూరు కాపు యువగర్జన పోస్టర్ ఆవిష్కరణ

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 09:5000 కోట్లతో మున్నూరు కాపు ఆర్థిక కార్పొరేషన్ ప్రకటించాలని మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పోనగంటి మల్లయ్య అన్నారు. మంగళవారం స్థానిక మండల కేంద్రంలో మున్నూరు కాపు యువగర్జన పోస్టర్ ను మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఏభూషి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పొన్నగంటి మల్లయ్య,సింగిల్ విండో అధ్యక్షులు పొనగంటి సంపత్,మున్నూరు కాపు సంక్షేమ సంఘం జిల్లా నాయకులు సాయిని రవి,ఆకుల రాజేందర్ లు మాట్లాడారు.ఈ నెల … Read more

నీళ్లు ఇచ్చేదాక నిన్నొదల రేవంత్ రెడ్డి

హుజురాబాద్ ఏప్రిల్ 06:హుజురాబాద్ నియోజకవర్గంలో రైతులకు మరో తడి నీళ్లు అందించేదాకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వదిలిపెట్టనని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శనివారం బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పిలుపుమేరకు హుజరాబాద్ పార్టీ కార్యాలయం వద్ద  చేపట్టిన ఒక్కరోజు రైతు దీక్షలో భాగంగా ఆయన మాట్లాడారు. బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఆదేశాల మేరకు 118 నియోజకవర్గాలతో పాటు ఈ నియోజకవర్గంలో కూడా రైతులకు ప్రభుత్వం వెంటనే సాగునీరు అందించాలని ఉద్దేశంతో దీక్ష చేపట్టామన్నారు. ఈ … Read more

రైతులకు నీళ్లు ఇస్తారా గేట్లు ఎత్తమంటారా తేల్చుకోండి

కమలాపూర్ ఏప్రిల్ 03:తెలంగాణ రైతులకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే హుజురాబాద్ నియోజకవర్గం లోని 106 గ్రామాలకు మరో తడి కోసం నీళ్లు అందించాలని, నీళ్లు ఇవ్వకపోతే స్వయంగా తానే గేట్లు ఎత్తుతానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం మర్రిపల్లి గూడెం గ్రామంలో మొక్కజొన్న ఎండుతున్న తీరును చూసి రైతుల పక్షాన మాట్లాడారు. ప్రభుత్వం చెప్పిన విధంగానే రైతులు పంటలు వేసుకున్నప్పటికీ … Read more

సులోచనాదేవి దంపతులు శేషజీవితం హాయిగా గడపాలి

జమ్మికుంట మార్చ్ 31:జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పొత్కపల్లి టీచర్ చదువు సులోచనాదేవి ఉద్యోగ విరమణ అభినందన సన్మాన సభ ఆదివారం జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. జెడ్పీహెచ్ఎస్ పొత్కపల్లి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు,పాఠశాల యాజమాన్య కమిటీ, హెచ్ఎంలు,స్టూడెంట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు విద్యార్థులు,పుర ప్రముఖులు,రాజకీయ నాయకులు,విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 37 ఏండ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో మంది విద్యార్థినీ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన … Read more

జగ్గయ్యపల్లిలో ఘనంగా పోచమ్మ బోనాలు

జమ్మికుంట మార్చ్ 31:చిరుతల రామాయణం తెలంగాణా ప్రాంతంలో చాలా వ్వాప్తిలో ఉంది.ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో చిరుతల రామాయణం అతి ప్రాచీన కళారూపం.పల్లెల్లోని యువకులు,కళా అభిమానులు కలిసి ఒక గురువును నియమించుకుని చిరుతల రామాయణాన్ని నేర్చుకుంటారు.అలాంటి కళారూపాన్ని జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామములో ఏప్రిల్ మూడవ తారీఖు నుండి ఏడవ తారీఖు వరకు ప్రదర్శిస్తున్నట్లు రామాయణ కళాకారులు తెలిపారు.రామాయణ కళాకారుడు,కరీంనగర్ జిల్లా సాంస్కృతిక సంస్థల సమైక్య జిల్లా ఉపాధ్యక్షుడు బోల్ల కొమురయ్య,శంకరపట్నం మండల అధ్యక్షుడు పడాల సత్యనారాయణ … Read more

ప్రణవ్ బాబు కు సోలార్ ఫ్యాన్ టోపీని బహూకరించిన సాదుల రాంబాబు

వేసవి కాలంలో వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు కాంగ్రెస్ వీరాభిమాని సాదుల రాంబాబు దుబాయ్ నుంచి తెప్పించిన ప్రత్యేకమైన సోలార్ ఫ్యాన్  పరికరంతో క్యాప్ లో ఇమిడే విధంగా సోలార్ ఫ్యాన్ తయారుచేసి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ కు సింగపూర్ లోని తన నివాసంలో బహుకరించారు.అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోలార్ ఫ్యాన్ టోపీని ఉగాది సందర్భంగా అందజేసేందుకు అవకాశం కల్పించాలని ప్రణవ్ ను కోరారు.వెంటనే స్పందించిన ప్రణవ్ ముఖ్యమంత్రి … Read more