దాణాపూర్ ఎక్స్ ప్రెస్ ఆగడం పై బిజెపి శ్రేణుల హర్షం

ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సికింద్రాబాద్ – దాణాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు (12791/92)  జమ్మికుంటలో ఆగడానికి రైల్వే శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం హర్షనీయమని, ఇది రైల్వే ప్రయాణికులకు వ్యాపారులకు శుభవార్త లాంటిదని బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. దానాపూర్ ఎక్స్ ప్రెస్ జమ్మికుంటలో ఆపడానికి రైల్వే శాఖ చర్యలు తీసుకున్నందున స్థానిక బిజెపి శ్రేణులు రైల్వే స్టేషన్లో ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విన్ కుమార్,ఎంపీ బండి సంజయ్ కుమార్ చిత్రపటాలకు … Read more

గోడిశాల గ్రామాన్ని సందర్శించిన ఎన్ఆర్ఎస్ సైంటిస్టులు

సైదాపూర్ మండలంలోని  గొడిశాల గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను చూడడానికి నేషనల్ రిమోట్  సెన్సింగ్ (ఎన్ఆర్ఎస్) నుండి జోషి, బూర్ల అనిల్ కుమార్ సైంటిస్టులు మరియు సిఆర్డి నుండి అభయ్ కుమార్ వచ్చారు.ఈ కార్యక్రమంలో  భాగంగా ఫారం పాండ్స్, భూగర్భ జలాల పెంపు,ఫీడర్ ఛానెల్స్, వ్యవసాయ సాగు పెరుగుదల, హరితహరం, గ్రామంలో చేపట్టిన హార్టికల్చర్ పండ్ల తోటలు,నర్సరీ,పల్లె ప్రక్రుతి వనాలు,ఇతర ఉపాధి హామీ పథకం పనులను సమీక్షించారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి … Read more

శాయంపేట లో ఐమాక్ లైట్స్ ని ప్రారంభించిన జడ్పీటీసీ శ్యాం

జమ్మికుంట మండలంలోని శాయంపేట గ్రామంలో ఐమాక్స్ లైట్ ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జమ్మికుంట జడ్పిటిసి డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ హాజరై వాటిని ప్రారంభించారు.  ఈ సందర్భంగా జెడ్పిటిసి శ్రీరామ్ శ్యామ్ మాట్లాడుతూ జమ్మికుంట మండలంలోని వావిలాల, పెద్దoపల్లె,జగ్గయ్యపల్లి,పాపక్కపల్లె శంభునిపల్లె  తనుగుల,నాగంపేట్,కోరపల్లి,వెంకటేశ్వరపల్లి, గ్రామాలలో జిల్లా పరిషత్ నిధి నుండి ఒక్కొక్క గ్రామానికి ఒక లక్ష రూపాయలు చొప్పున కేటాయించి ఆయా గ్రామాలలో ఐమాక్స్ లైట్లు నిర్మాణం చేయడం జరిగిందని తెలిపారు.ఇవే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని  … Read more

తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా మహేందర్ గౌడ్

తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శిగాహుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామ మాజీ సర్పంచ్ మహేందర్ గౌడ్ ని నియమించారు.గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనగాని యాదగిరి గౌడ్ నియామక పత్రం అందజేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి జిల్లా,రాష్ట్ర స్థాయి వరకు గౌడ సంఘ అభివృద్ధికి పాటుపడాలని మహేందర్ గౌడ్ కు సూచించారు.

ఆర్యవైశ్య సంఘం జమ్మికుంట పట్టణ అధ్యక్షుడిగా కె.ఆర్.వి నరసయ్య

జమ్మికుంట పట్టణంలో సోమవారం జరిగిన ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో 21 ఓట్ల మెజార్టీతో కె.ఆర్.వి నరసయ్య తన సమీప అభ్యర్థి గర్రెపల్లి వెంకటేశ్వర్లుపై గెలుపొందినట్లు ఎన్నికల అధికారి పబ్బతి రాజగోపాల్,కన్వీనర్ ముక్క వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు.మొత్తం 1626 ఓట్లు ఉండగా 662 ఓట్లు పోలైనవి.ఇందులో కె.ఆర్.వి నరసయ్యకు 337 ఓట్లు రాగా గర్రెపల్లి వెంకటేశ్వర్లకు 316 ఓట్లు వచ్చాయని మూడవ స్థానంలో కె.ఆర్.వి నరసయ్యకు మద్దతు తెలిపిన కొండ్లె పాపయ్యకు ఏడు ఓట్లు వచ్చాయని రెండు … Read more

మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా ఏబూసి శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన సీనియర్ రిపోర్టర్ ఏబూసి శ్రీనివాస్ ను ఇటీవల హైదరాబాదులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నియమించారు.ఆదివారం సాయంత్రం కరీంనగర్ లో ఉమ్మడి జిల్లా మున్నూరు కాపు జర్నలిస్టుల సమావేశం జిల్లా అధ్యక్షుడు వేల్పుల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ విచ్చేసి నియామక పత్రాన్ని ఏబూసి శ్రీనివాస్ కు … Read more

ఒక్క ఓటమితో ఈటల ‘ఆత్మగౌరవం’ బదిలీ?

ఈటల రాజేందర్..ఈ పేరు బహుశా తెలంగాణ రాజకీయాల్లోనే కాదు..దేశంలోనూ ప్రజానీకానికి..రాజకీయ ఓనమాలు తెలిసిన అందరికీ తెలిసిన పేరు అని చెప్పొచ్చు. హుజురాబాద్ నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు రాజకీయ యవనికపై స్థానం సుస్థిరం చేసుకున్న తెలివైన రాజకీయ నాయకుడిగా రాజకీయ వర్గాల్లో ఆయనకు పేరుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ‘నాడు’ ఉద్యమంలో, ఆ తర్వాత రాష్ట్ర ఏర్పాటు, ప్రభుత్వంలో, ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ కీలక భూమికను పోషించిన ధీశాలి ఈటల. ‘గులాబీ జెండా’కు ఓనర్లం … Read more

బీజేపీ గెలిస్తే మోదీయే పీఎం- మరి కాంగ్రెస్ గెలిస్తే ఎవరు పీఎం

మరో 10 రోజుల్లో ఎన్నికల కోడ్ రాబోతోంది.ఆరు గ్యారంటీలు అటకెక్కబోతున్నాయి.ఆ హామీలను కాకి ఎత్తుకెళ్లిందని చెప్పబోతున్నరు.గట్టిగా నిలదీస్తే మేం హామీలను అమలు చేయాలనుకున్నాం,కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది.ఎన్నికలైపోంగనే అమలు చేస్తామని కాకమ్మ కథలు చెప్పబోతున్నరని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.గత పాలనలో చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ తో కుమ్కక్కై 6 గ్యారంటీలపై నోరు మెదపడటం లేదని మండిపడ్డారు.రెండు పార్టీలకు తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ … Read more

బ్రాంజ్ మెడల్ సాధించిన క్రీడాకారిణి అక్షిత కి ఘన సన్మానం

తమిళనాడు లోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడింలో ఫిబ్రవరి 27నుండి 29  జరిగిన – 46 కేజీ వయస్సులో విజయవంతంగా రెండో రౌండ్ పూర్తి చేసుకొని మూడవ రౌండ్ లో తృతీయ స్థానం సాధించి భ్రాంజ్ మెడల్ అందుకొని వచ్చిన వీణవంక మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బబ్బూరి అక్షిత వీణవంక ప్రభుత్వ హైస్కూల్ లో 10 వ తరగతి చదువుకుంటూ క్రీడలపై ఉన్న మక్కువతో తైక్వాండో అనే క్రీడను ఎంచుకొని తైక్వాండో అసోసియేషన్ కరీంనగర్ జిల్లా … Read more

మున్సిపల్ సర్వసభ్య సమావేశ ఎజెండా లో అవినీతి

మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో ప్రవేశ పెట్టిన ఎజండ ప్రజల కోసం అభివృద్ది కోసం ఉపయోగ పడేలా లేదని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఆరోపిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సర్వసభ్య సమావేశం 12 గంటలకు వుందని సమాచారం అందించి ఆ తరువాత 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ అధికారులు మళ్ళీ సమాచారం అందించారని తెలిపారు.ఈ సమాచారం తో 11:30 కు మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ గదిలోకి వెళ్ళగానే … Read more