hyderabad
జర్నలిస్టులను అరెస్టు చేయడం అన్యాయం
టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కోకన్వీనర్ కే బాపురావు కరీంనగర్/ధనాధన్ న్యూస్:ఎన్టీవీ మీడియాలో ఒక మహిళా ఐఏఎస్ అధికారిపై ప్రసారమైన కథనంపై ఎటువంటి విచారణ చేయకుండా, ముందస్తు నోటీసు ఇవ్వకుండా సిట్ పోలీసులు ఓ ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) తీవ్రంగా ఖండించింది. ఎన్టీవీలో వచ్చిన కథనానికి జర్నలిస్టులు దొంతు రమేశ్, పరిపూర్ణ చారి, సుధీర్ లను బాధ్యులను చేస్తూ ‘సిట్’ పోలీసులు ముందస్తునోటీసులు ఇవ్వకుండా నేరుగా అరెస్టు చేయడం దారుణమని … Read more
ఐబొమ్మపై సీపీఐ నారాయణ సంచలనం
హైదరాబాద్: సీపీఐ సీనియర్ నేత నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఐబొమ్మ పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్, అలాగే మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్ అంశాలపై స్పందిస్తూ ఆయన వ్యవస్థాగత లోపాలను తీవ్రంగా దుయ్యబట్టారు.ఐబొమ్మలో సినిమాలు చూసిన నారాయణఐబొమ్మ వ్యవహారంపై మాట్లాడిన నారాయణ, తాను కూడా ఆ వెబ్‌సైట్‌లో సినిమాలు ఫ్రీగా చూసినట్లు బహిరంగంగా ఒప్పుకున్నారు. “ఆరేడు వందలు పెట్టి సామాన్యులు సినిమాలు ఎలా చూసేది? నేను కూడా ఐబొమ్మలోనే సినిమాలు … Read more
గోవులను తరలిస్తుండగా కాల్పులు
ధనాధన్ న్యూస్,అక్టోబర్,బుధవారం 22: ఘట్కేసర్ మండల పరిధిలో గోవులను తరలిస్తున్న వాహనాలను అడ్డుకోవడంతో చోటుచేసుకున్న కాల్పుల ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించింది. గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిని ఆపేందుకు ప్రయత్నించిన గోరక్షకులు ఎదుర్కొన్న దాడిలో సోను (ప్రశాంత్) అనే యువకుడు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన యశోద ఆసుపత్రికి చేరుకుని గాయపడిన సోను … Read more
కల సౌకర్యాలతో మహా మేడారం జాతర – మంత్రి సీతక్క
హైదరాబాద్, సెప్టెంబర్ 03:సమ్మక్క–సారలమ్మల త్యాగ ఔన్నత్యానికి తగిన వేడుకగా మేడారం మహా జాతరను నిర్వహిస్తామని మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రకటించారు. జాతర ప్రారంభానికి ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ఉన్నతాధికారులు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్, వివిధ విభాగాల ఇంజనీర్లు పాల్గొన్నారు. సమ్మక్క–సారలమ్మ పూజారుల సూచనల మేరకు … Read more
సైదాపూర్‌లో బిఆర్ఎస్ ధర్నా, రాస్తారోకో
సైదాపూర్, సెప్టెంబర్ 2 (ధనాధన్ న్యూస్):సైదాపూర్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం భారీ స్థాయిలో ధర్నా, రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సోమారపు రాజయ్య మాట్లాడుతూ –రైతులు యూరియా కోసం రోజుల తరబడి క్యూల్లో నిలబడుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని తీవ్ర విమర్శలు చేశారు. వారానికి ఒక్కటి రెండు లారీలు యూరియా సరఫరా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై … Read more
బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్
హైదరాబాద్, సెప్టెంబర్ 2:భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీకి అనుబంధంగా ఉన్న ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘన, పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు. సస్పెన్షన్ వెనుక కారణాలు ఇటీవల కాలంలో కవిత పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రవర్తించారని, పార్టీకి ఇబ్బందులు కలిగించే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. క్రమశిక్షణలో లోపం ప్రదర్శించినందుకు … Read more
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై బిగ్ అప్‌డేట్
హైదరాబాద్/ధనాధన్ న్యూస్, ఆగష్టు 26: తెలంగాణలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు మార్గం సుగమమైంది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్ కోసం కీలకమైన ఓటర్ల జాబితా సవరణ పనులను ప్రారంభించింది. హైకోర్టు కీలక తీర్పు 2024 జనవరి 31తోనే తెలంగాణలోని సర్పంచుల పదవీకాలం ముగిసింది. దీంతో గ్రామాల్లో సర్పంచ్ చెక్ పవర్ నిలిచిపోగా, … Read more
కౌశిక్ రెడ్డి దృష్టి చిల్లర రాజకీయాల మీద-మా దృష్టి అభివృద్ధి మీద
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కేసీఆర్,కేటీఆర్ మెప్పు పొందడానికే కౌశిక్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని,అభివృద్ధిని గాలికి వదిలేసి చిల్లర రాజకీయాల మీద దృష్టి పెడితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్డిఎఫ్ ఫండ్ కింద పది కోట్ల రూపాయలు మంజూరు చేస్తే అభివృద్ధి చేస్తున్నామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ అన్నారు.మంగళవారం నాడు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు.అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి విద్య,వైద్య … Read more