పోస్ట్ ద్వారా సీఎం కి వినతిపత్రం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: హుజరాబాద్ నియోజకవర్గం రెండవ విడత దళిత బంధు నిధులను విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి పోస్ట్ ద్వారా వినతి పత్రం పంపడం జరిగింది.ఈ సందర్భంగా జమ్మికుంట మాజీ జెడ్పిటిసి డాక్టర్.శ్రీరామ్ శ్యామ్ మాట్లాడుతూ గత రాష్ట్ర ప్రభుత్వం హుజురాబాద్ నియోజకవర్గం దళిత బంధు పైలెట్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడం జరిగింది.అందులో భాగంగా ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున నిధులను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం … Read more

నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటా:ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్ సెప్టెంబర్ 25:  హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రజల ఏవైనా సమస్యలు వచ్చినప్పుడూ తాను ఎప్పుడు అండగా ఉంటానని, వాటి పరిష్కారానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం ఆయన అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొన్న బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు. “నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులుంటే నేరుగా నన్ను సంప్రదించండి. నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. ప్రజల సంక్షేమం కోసం అందుబాటులో ఉండటం నా … Read more

కార్యకర్తలే బీజేపీ పార్టీకి బలం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: సభ్యత్వ నమోదు అనేది పార్టీకి పునాది లాంటిదని,కార్యకర్తలే బిజెపి పార్టీ బలం అని  జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు అన్నారు.ఈరోజు వీణవంక మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు రామిడి ఆదిరెడ్డి అధ్యక్షతన సభ్యత్వ నమోదు కార్యాశాల (సన్నాహక సమావేశం)  జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు ఎరబెల్లి సంపత్ రావు మాట్లాడుతూ దేశంలో ఉన్న అత్యధిక రాజకీయ పార్టీలు కొంత మంది వ్యక్తుల మీద ఆధారపడి ముందుకు … Read more

ప్రభుత్వ భూమి రక్షణకు కృషి చేయాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని సర్వేనెంబర్ 629, 467,286 లో గల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదే అని మాజీ జెడ్పిటిసి డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ అన్నారు. గురువారం జమ్మికుంట తహసిల్దార్ కు ప్రభుత్వ భూములు రక్షించాలంటూ వినతి పత్రం సమర్పించిన మాజీ జెడ్పిటిసి శ్యామ్ మాట్లాడుతూ,గత ప్రభుత్వ హయాంలో అధికారుల అండదండలతో నాయకుల సహకారంతో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయని ఆయన అన్నారు. అధికారులు సైతం … Read more

హుజురాబాద్ నియోజకవర్గ ఆడబిడ్డలకు రక్షా బంధన్ శుభాకాంక్షలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: రక్షా బంధన్ సందర్భంగా సమాజంలో సోదర భావం మరింత పెంపొందాలని,హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఒక ప్రకటనలో తెలిపారు.మహిళల రక్షణ పట్ల,మహిళల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని దాంట్లో భాగంగానే ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అందించామని,ఉచిత బస్ సౌకర్యం ద్వారా అనేకమంది స్త్రీలు లబ్ధి పొందారని అన్నారు.అలాగే రాబోయే రోజుల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల … Read more

హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి నలుగురు డాక్టర్ల నియామకం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ లో వైద్యులు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జి ప్రణవ్ త్వరితగతిన వైద్యులను నియమించాలని జిల్లా కలెక్టర్ ను కోరగా స్పందించిన కలెక్టర్ ఏరియా హాస్పిటల్ కు నలుగురు వైద్యులు నియమిస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడించారు.హుజురాబాద్,జమ్మికుంట ఆసుపత్రులకు 15 లక్షల రూపాయలను వాటి అభివృద్ధి కొరకు కేటాయించేలా కృషి చేశారు.ఆసుపత్రులకు నిత్యం అనేకమంది రోగులు వస్తుంటారు,వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అన్ని … Read more

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా డాక్టర్ రమేశ్

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా డాక్టర్ బి. రమేష్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ రసాయనశాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ బి.రమేష్ జమ్మికుంటకు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ఆయన్ను కాలేజీ విద్యా శాఖ కమిషనరేట్ ఆఫీసు  జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ (ఎఫ్ఏసీ)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రమేష్ కళాశాల పూర్తి అదనపు బాధ్యతల ప్రిన్సిపాల్‌గా విధులలో చేరారు.ఈ సందర్భంగా కళాశాల అధ్యాపక,అధ్యాపకేతర సిబ్బంది … Read more

మానసిక దివ్యాంగ విద్యార్థులకు అండగా ఉంటా

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: అన్ని అవయవాలు సక్రమంగా ఉండి కూడా పిల్లలు అల్లరి చేస్తే మనం విసుక్కుంటామని,అలాంటిది దివ్యాంగులైన పిల్లలకు విద్య నేర్పడం,కోచింగ్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదని దాన్ని  నిర్వహిస్తున్న,శిక్షణ ఇస్తున్న సిబ్బంది గొప్ప మనసు గల వారిని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.జమ్మికుంట పట్టణంలోని 8వ వార్డులో గల సాయి మానసిక దివ్యంగుల ప్రత్యేక పాఠశాలను ఆయన సందర్శించారు.పాఠశాలలో నూతనంగా నిర్మించినటువంటి వంటగదిని,పాఠశాలలో మరమ్మత్తు చేసిన ఇతర వాటిని ఆయన … Read more

సర్కార్ దవాఖానలో సౌలతులు ఏవి?

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వా ఆస్పత్రుల్లో ‘‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’’ అనే పరిస్థితి నెలకొంది.ఆస్పత్రుల్లో వైద్యులు సరిపడా కాదు కనీసంగా కూడా లేకపోవడంపై జనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా, హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని హుజురాబాద్, జమ్మికుంట మండలకేంద్రాలలోని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సదుపాయల,డాక్టర్‌ల కొరత ఉందని ఏడాది క్రితం నుంచి ప్రముఖ సామాజికవేత్త, మల్టీ నేషనల్ కంపెనీ ‘జెన్‌ప్యాక్ట్’ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్ చెప్తూనే ఉన్నారు. హుజూరాబాద్ … Read more

వర్షాకాలంలో వైరల్ జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండండి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: వర్షాకాలం సందర్భంగా గ్రామాలలో డెంగ్యూ,మలేరియా లాంటి వైరల్ జ్వరాలు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని,ఆ భాధ్యత ఆయా మండలాల ఎంపిడిఓలు తీసుకోవాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.జమ్మికుంట,హుజురాబాద్ మున్సిపల్ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని కోరారు.ప్రతీ ఒక్కరూ ఇంటి పరిసరాల్లో చెత్త,నీరు నిల్వఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.అంతేకాకుండా గ్రామాల్లో పారిశుధ్యంపై ఎంపిడిఓలు ఆయా శాఖల అధికారులతో సమన్వయపరుస్తూ ప్రత్యేక దృష్టి పెట్టాలని,మిషన్ … Read more