ఎయిమ్స్ ఒలంపియాడ్ హంట్ లో  సెయింట్ జోసెఫ్ విద్యార్థినికి స్టేట్ 5వ ర్యాంక్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులకు  ఎయిమ్స్ ఒలంపియాడ్ హంట్ వారు నిర్వహించిన వివిధ  ప్రామాణిక పరీక్షల్లో పోటీపడి జమ్మికుంట సెయింట్ జోసెఫ్ స్కూల్ కు చెందిన 8వ తరగతి విద్యార్థిని నిహా తన్నజ్ స్టేట్ 5వ ర్యాంక్ సాధించింది. ఇదే స్కూల్ కు చెందిన 7వ తరగతి విద్యార్థిని కే. విశ్వశ్రీ జోనల్ లెవల్ లో 9వ ర్యాంక్ సాధించింది. ఎయిమ్స్ ఒలంపియాడ్ హంట్ ఫైనల్ … Read more

హుజురాబాద్ డిపోను సందర్శించిన ఆర్ఎం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ పట్టణ కేంద్రంలోని స్థానిక డిపోను కరీంనగర్ రీజినల్ మేనేజర్ రాజు మంగళవారం రోజున సందర్శించారు. అనంతరం డిపో ఆవరణలో మొక్కలు నాటి ఆర్టీసీ సిబ్బందికి పలు సూచనలు తెలియజేశారు. ఆర్ఏం మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న ఆర్టీసీ కార్పొరేషన్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో లాభాల బాటలో నడుస్తుందని, దీనికి ప్రధాన పాత్ర పోషిస్తుంది డ్రైవర్,కండక్టర్,మెకానిక్ లని,ఎంతో శ్రమ ఒడ్చి వారు కార్పొరేషన్ కోసం కృషి చేస్తున్నారని,ఆర్టీసీ డిపోలో ప్రశాంతమైన వాతావరణం … Read more

పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: అర్హులైన ప్రతి పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ అన్నారు.హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లబ్దిదారులకు పది లక్షల విలువ చేసే ఎల్.ఒ.సీ లను,సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రమాదవశాత్తు,వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొంది ఆర్థిక భారం భరించలేక ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ భాద్యతగా అండగా ఉంటుందని అన్నారు.సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు చేసిన సందర్భంగా సీఎం రేవంత్ … Read more

గుండె పోటుకి గురై ఆర్టీసీ డ్రైవర్ మృతి

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలం దుద్దేనపల్లి గ్రామానికి చెందిన ఠాకూర్ రమేష్ సింగ్ తండ్రి రాధా కిషన్ సింగ్ వయస్సు 46,ఆదివారం రోజున విధి నిర్వహణలో భాగంగా హుజరాబాద్ ఆర్టీసీ డిపో నుండి ఉదయం హైదరాబాద్ వెళ్తుండగా మార్గం మధ్యలో గుండె పోటు రావడంతో,బస్సులో ఉన్న ప్రయాణికులు హాస్పిటల్స్ లో తరలించారు,చికిత్స పొందుతూ మృతి చెందాడు,ఆయనకు భార్య మంజుల,ముగ్గురు కుమార్తెలు అర్చన,అఖిల,అన్విత ఉన్నారు.ఆయన మృతి పట్ల  కుటుంబ సభ్యులు బోరున విలపించారు.ఆర్టీసీ ఉద్యోగులు,గ్రామ ప్రజలు,సంతాపం తెలిపారు.ఆయన కుటుంబానికి … Read more

భవిష్యత్తు మున్నేరుపాలు..!!

ఖమ్మం/ధనాధన్ న్యూస్: ఒకరు కాదు..ఇద్దరు కాదు..సుమారు 500 మంది విద్యార్థుల విద్యార్హతల సర్టిఫికెట్లు మున్నేరుపాలయ్యాయి.టెన్త్‌ మొదలు పీజీ వరకు పూర్తి చేసిన విద్యార్థులే కాక కొందరు ఉద్యోగాలు చేస్తున్న వారి సర్టిఫికెట్లు సైతం వరదలో కొట్టుకుపోయాయి.దీంతో వారంతా దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు.ఖమ్మం నగరం,ఖమ్మం రూరల్‌ మండలాన్ని మున్నేరు వరద ముంచెత్తగా 50 కాలనీల్లోకి నీరు చేరింది. అందులో కొన్ని ఇళ్లు కొట్టుకుపోగా..కొన్ని నేలమట్టమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున మున్నేరు వరద చుట్టుముట్టడంతో బాధితులు కట్టుబట్టలతో వెళ్లిపోయారు. వరద తగ్గాక … Read more

ప్రభుత్వ భూమి రక్షణకు కృషి చేయాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని సర్వేనెంబర్ 629, 467,286 లో గల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదే అని మాజీ జెడ్పిటిసి డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ అన్నారు. గురువారం జమ్మికుంట తహసిల్దార్ కు ప్రభుత్వ భూములు రక్షించాలంటూ వినతి పత్రం సమర్పించిన మాజీ జెడ్పిటిసి శ్యామ్ మాట్లాడుతూ,గత ప్రభుత్వ హయాంలో అధికారుల అండదండలతో నాయకుల సహకారంతో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయని ఆయన అన్నారు. అధికారులు సైతం … Read more

మోడల్ స్కూల్ చుట్టూ ప్రహరీ గోడను నిర్మించాలి

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలం సోమవారం  మోడల్ స్కూల్  లో బుదవారం రోజున అఖిలభారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య (ఏఐఎఫ్ డిఎస్) అధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులతో ఉమ్మడి జిల్లా  ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీకాంత్ సభ్యత్వం నమోదు చేయించారు, అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ వర్షాకాల సమయంలో వర్షాలు భారీగా కురిస్తే క్లాస్ రూమ్ లోకి వర్షపు నీరు వస్తుందని,పాములు,తేళ్లు కప్పలు స్కూల్ లోపలికి వస్తూన్నాయని,చుట్టుపక్కల గడ్డి బాగా పెరిగిందని,రాత్రి సమయంలో గర్ల్స్ హాస్టల్లో చీకటిగా ఉందని స్కూల్ … Read more

విద్యార్థుల జుట్టు కట్ చేసిన ఉపాధ్యాయురాలు

ఖమ్మం/ధనాధన్ న్యూస్: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ ప్రభుత్వ హైస్కూల్లో టీచర్ విద్యార్థుల జుట్టు కట్‌ చేయడం కలకలం రేపింది.దీంతో టీచర్ తీరును నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం సాయంత్రం ఆందోళనకు దిగారు.టీచర్ కత్తిరించడంతో విద్యార్దులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.టీచర్ శిరీష అమానుషంగా ప్రవర్తించడం సరియైనది కాదని పేరెంట్స్ తో కలిసి ప్రధాన ఉపాధ్యాయుడు వద్ద ఆందోళన చేశారు.ప్రభుత్వ హై స్కూల్ లో 6,7,8,9,10 తరగతి చదువుతున్న 20 మంది విద్యార్థులకు ఇంగ్లీష్‌ టీచర్ కత్తెరతో … Read more