ఘనంగా తల్లిపాల దినోత్సవం

వీణవంక/ధనాధన్ న్యూస్:వీణవంక  మండలంలోని అంగన్వాడి కేంద్రంలో మండల సెక్టార్ ఇంచార్జ్ శ్యామలదేవి ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్ ఒరేం శ్రావణి తల్లిపాల దినోత్సవాల్లో భాగంగా పిల్లలకు అన్నప్రాసన  కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిపాలే పిల్లలకు ఆరోగ్యమని ప్రతి ఒక్కరూ పుట్టిన పాపకు తల్లిపాలనే తాగించాలని అన్నారు.అనంతరం గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.

ఎస్బీఐ ఖాతాదారులకు కేంద్రం హెచ్చరిక!

న్యూస్ డెస్క్/ధనాధన్ న్యూస్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారులకు అలర్ట్‌! మీ ఎస్బీఐ ఖాతాకు రివార్డ్స్ పాయింట్స్ ఉన్నాయని, వాటిని క్లైమ్ చేసుకునేందుకు ఎస్బీఐ రివార్డ్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండంటూ ఓ ఫేక్‌ మెసేజ్‌ తాజాగా సర్య్యూలేట్‌ అవుతోంది. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర‌ ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నకిలీ ఎస్‌ఎంఎస్‌లకు ఎట్టిపరిస్థితుల్లోనూ స్పందించవద్దని ఎస్బీఐ ఖాతాదారులకు సూచించింది. వ్యక్తిగత,బ్యాంకింగ్‌ వివరాలను పంచుకోవద్దని వెల్లడించింది.ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ తన అధికారిక … Read more

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: గౌడ కులస్తులు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వారిని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.వృత్తి రీత్యా తాడిచెట్లు ఎక్కి జీవనం సాగించే గౌడ కులస్తులు నిత్యం ప్రమాదాలు జరగడం కొంత బాధ కలిగిస్తుందని,ఇటీవల జమ్మికుంట మండల పరిధిలోని మడిపల్లి గ్రామంలో మాచర్ల నాగేశ్వర్ గౌడ్ మృతి తీవ్ర బాధను కలిగించిందని,వారికి అండగా నిలవాలని సర్వాయి పాపన్న గీత కార్మిక … Read more

నిరుపేదల నివేషణ స్థలంలో డంపింగ్ యార్డ్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆటోనగర్ సమీపంలో సర్వే నంబర్ 275,76,77,78 లో 2006 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 300 నిరుపేద కుటుంబాలకు నివేషణ స్థలం మంజూరు చేసి పట్టాలు ఇచ్చింది.ఈ స్థలాలలో  కొంతమంది ఆర్థిక స్తోమత కలిగిన వారు నిర్మాణాలు చేపట్టారు.స్తోమత లేని వారు జమ్మికుంటలో కిరాయిలలో జీవనం కొనసాగిస్తున్నారు.ఇదిలా ఉండగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డంపింగ్ యార్డ్ల నిర్మాణంలో భాగంగా నిరుపేదలకు పంపిణీ చేసిన నివేషణ స్థలాలను … Read more

మాజీ జెడ్పిటిసి కుటుంబాన్ని పరామర్శించిన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామానికీ చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,మాజీ జెడ్పిటిసి గుండారపు శోభ శ్రీనివాస్ తల్లి గుండారపు కనకమ్మ ఇటీవల మరణించడంతో  కుటుంబాన్ని మాజీ రాష్ట్ర హౌజ్ ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పరామర్శించారు.ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ కౌన్సిలర్ కోమటి స్వర్ణలత సత్యనారాయణ,మాజీ ఎంపిటిసి చాడా చైతన్య కొండల్ రెడ్డి,మాజీ పట్టణ అధ్యక్షులు అక్కు శ్రీనివాస్,గ్రామ అధ్యక్షులు తాళ్లపెళ్లి వెంకటేశం,యూత్ కాంగ్రెస్ నాయకులు పూదారి హరీష్ గౌడ్,బోనగిరి అనిల్,మాడెపు రాహుల్ … Read more

నీళ్లు ఇవ్వకపోతే రైతులతో వచ్చి పంపులు ఆన్ చేస్తా

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో మా అందరిపై కోపం ఉంటే మా మీదే చూపించాలి తప్పా రైతుల మీద కాదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ఆయన మాట్లాడారు. హుజురాబాద్ నియోజకవర్గ రైతులకు నీళ్లు అందగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాలేశ్వరం ప్రాజెక్టు లక్ష్మి పంప్ హౌస్ వద్ద 17 పంపులు రెడీగా ఉన్నాయని వెంటనే … Read more

ఘనంగా వొడితల రాజేశ్వర్ రావు 13వ వర్థంతి

రాజకీయ దురంధరుడు,స్నేహశీలి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వొడితల రాజేశ్వరరావు ఆశలను కొనసాగించడమే తన లక్ష్యమని,వారసత్వంగా వచ్చిన ప్రజల ప్రేమాభిమానలు పొంది వారికి సేవ చేస్తాననీ హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ అన్నారు.మాజీ రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వొడితల రాజేశ్వరరావు 13వ వర్ధంతి వేడుకలు హుజురాబాద్ పట్టణంలో ప్రణవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు,మానకొండూర్ మాజీ శాసన సభ్యుడు ఆరపల్లి మోహన్ పాల్గొన్నారు.ఈ … Read more

జమ్మికుంట రైల్వే స్టేషన్ లో వ్యక్తి మృతి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట రైల్వే స్టేషన్ లో బీహార్ రాష్ట్రానికి చెందిన రైస్ మిల్ హమాలీ అనారోగ్యం తో మృతి చెందాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ జీ.తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ట్రం నలంద జిల్లా పినిపర్ గ్రామానికి చెందిన దినేష్ యాదవ్(46) గత కొంతకాలంగా జమ్మికుంటలోని రైస్ మిల్ లో హమాలీగా పనిచేస్తూ ఉన్నాడు.తిరిగి ఊరికి వెళ్ళడానికి జమ్మికుంట రైల్వే స్టేషన్ కి వచ్చి బుకింగ్ కౌంటర్ లో పడుకొని చనిపోయి ఉన్నాడని, బహుశా … Read more

వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం  మూడవసారి  ఏర్పడ్డాక ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్  పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ పై స్పందించిన బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం వికసిత భారత లక్ష్యంగా పనిచేస్తుందని,దానికి అనుగుణంగా ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా కేంద్ర బడ్జెట్ రూపొందించారని సంపత్ రావు … Read more

వరద బాధితులను ఓదార్చిన వోడితల ప్రణవ్

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ పట్టణంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణంలోని 23వ వార్డు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయింది.ఈ కాలనీలో దాదాపు 300 మంది బుడగ జంగాల ప్రజలు,పిల్లాపాపలతో గుడిసెలు వేసుకుని అనేక సంవత్సరాల నుండి నిరుపేద జీవితాలను గడుపుతున్నారు.నిన్న మొన్నటి భారీ వర్షాల వల్ల అనేక గుడిసెలపై గల తాత్కాలిక పైకప్పులు కొట్టుకుపోగా దాదాపు మొత్తం గుడిసెలు సగం నీటిలో కూరుకుపోవడంతో వస్తువులు, దుస్తులు,పక్క బట్టలు,రేషన్ బియ్యం ఇతర … Read more