కౌశిక్ రెడ్డిని విమర్శించే స్థాయి ప్రణవ్ ది కాదు

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)జూన్13: హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ ని విమర్శించే స్థాయి ప్రణవ్ కి లేదని బీఆర్ఎస్ సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి అన్నారు. గురువారం హుజరాబాద్ లోని ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వారం రోజులుగా ఫ్లై యాష్ స్కాం గురించి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంత్రి కనుసన్నలోనే స్కామ్ జరుగుతుంది అని ఆధారలతో నిరూపిస్తే ఇప్పటివరకు మంత్రి ఎందుకు స్పందించడం లేదని … Read more

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

సైదాపూర్(ధనాధన్ న్యూస్)జూన్12:ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని అందుకోసం ప్రభుత్వాలు సకల సౌకర్యాలు అందిస్తున్నట్లు ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి తెలిపారు.విద్యా సంవత్సరం ప్రారంభ రోజును పురస్కరించుకుని మండల కేంద్రంలోని వెన్కెపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం రోజున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా విద్యార్థులకు స్కూల్ యూనిఫాం లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ఆది నుండి నేటి … Read more

బడి బాటకి విస్తృత ప్రచారం

సైదాపూర్(ధనాధన్ న్యూస్)జూన్10:సైదాపూర్ మండల కేంద్రంలోని వెన్కేపల్లి ఉన్నత పాఠశాల ఉపాద్యాయులు మండలంలోని సైదాపూర్,వెన్కేపల్లి,జాగిరిపల్లి,గర్రెపల్లి,ఘనపూర్,బొత్తలపల్లి, రామచంద్రాపూర్,కురుమపల్లి,దుద్దేనపల్లీ గ్రామాలలో ఇంటింటా తిరుగుతూ విద్యార్థులకు, ఉపాధ్యాయులు ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా ఉపాద్యాయులు విస్తృత ప్రచారం చేస్తు అవగాహన కల్పిస్తున్నారు.ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన ఉచిత విద్యతో పాటు, డిజిటల్  విద్యాబోధన,అత్యాధునిక సౌకర్యాలు,ఉచిత పుస్తకాలు,సన్నబియ్యంతో నాణ్యమైన ఉచిత మధ్యాహ్న బిజనంతో పాటు యునిఫాం ఇస్తున్నట్లు ఉపాద్యాయులు చెబుతున్నారు.ఈ విద్యాసంవత్సరం వెన్కేపల్లి పాఠశాలలో 10వ తరగతిలో 100శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వివరించారు.మానసిక … Read more

రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 100 కోట్లు స్కామ్

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)జూన్08:రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా సంస్థ అధికారులతో కుమ్మక్కై రోజుకు 50 లక్షలు సంపాదిస్తున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు.శనివారం వే బిల్లు లేకుండా  అధిక లోడ్ రూల్ ప్రకారం 32 టన్నులతో పోవాల్సిన లారీలు 80 టన్నుల లోడ్ తో వెళ్తున్న ఫ్లై యాష్ లారీలను  అడ్డుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు.రోజుకి రెండు మూడు వందల ఫ్లై యాష్ లారీలు రామగుండం ఎన్.టి.పి.సి నుంచి ఖమ్మం వైపు … Read more

దుద్దెనపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ఎన్నిక

సైదాపూర్(ధనాధన్ న్యూస్)జూన్02:సైదాపూర్ మండలంలోని దుద్దేనపల్లి గ్రామంలో ఆదివారం రోజున ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.కుల పెద్దమనిషిగా గూళ్ల వెంకటయ్య,ప్రెసిడెంట్ గా నెల్లి శ్రీనివాస్,క్యాషియర్ గా నీల తిరుపతి,వైస్ ప్రెసిడెంట్ గా రొయ్యల శ్రీనివాస్, మెంబర్లు గా బొల్లి సురేష్,గూళ్ల అజయ్,పిట్టల కొమురయ్య,పిట్టల మొండయ్య,పెసరి సమ్మయ్య,నీల సమ్మయ్య లను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ప్రెసిడెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ నా పై నమ్మకం ఉంచి నా ఎన్నికకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా … Read more

ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)జూన్01:హనుమాన్ జన్మదిన పర్వదినాన్ని పురస్కరించుకుని జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామంలో హనుమాన్ మాల ధారణ స్వాములు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయమే స్వామీకి ప్రత్యేక అభిషేకం చేశారు.అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.అభిషేకం చేసే సమయంలో రాముని భజన,రామ నామ స్మరణతో భక్తులు తన్మయత్వం పొందారు.జయంతి సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు ఆలయాన్ని సందర్శించి ప్రత్యెక మొక్కులు చెల్లించుకున్నారు.విరుముడి కట్టుకొని హనుమాన్ మాల ధారణ స్వాములు విరమణకు బయలుదేరారు.అనంతరం మహా … Read more

ఇల్లందకుంట రామాలయానికి వెలిచాల విరాళం

ఇల్లందకుంట(ధనాధన్ న్యూస్)మే28:కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలకేంద్రంలోని రామాలయానికి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు  విరాళం ప్రకటించారు. అపర భద్రాద్రిగా పేరు గాంచిన సీతారామచంద్రస్వామి దేవస్థాన అభివృద్ధికి కాంగ్రెస్ నాయకుడు వెలిచాల రూ.2 లక్షల నగదును మంగళవారం అందజేశారు.

భూ ఆక్రమణలపై కలెక్టర్ కు పిర్యాదు

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే25:సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిని మాజీ సర్పంచ్ తన కుటుంబ సభ్యుల పేరున అక్రమ పట్టా చేసి ఆక్రమించుకున్నాడని గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ కి పిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే గ్రామ శివారు లోని మసీదు దగ్గర భూమిని పూర్వం అంబేద్కర్ భవనం,ప్రాథమిక పశువుల వైద్యశాలకు కేటాయించిన  భూమిని ఇందిరా సుధీర్ కుమార్ గౌడ్ సర్పంచ్ పదవిలో కొనసాగుతూ తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి సర్వేనెంబర్ 399/ఆ  లో సుమారు … Read more

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

ధనాధన్ న్యూస్ మే23:సైదాపూర్ మండల కేంద్రం నుంచి అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సైదాపూర్ ఎస్సై తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం,గురువారం తెల్లవారు జామున ఎస్సై పోలీసు సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా వెంకటేశ్వర్లపల్లి  గ్రామ శివారులో టీఎస్ 08 UB 3009 టాటా ఏసీ వాహనం వదిలి వెళ్ళగా వాహనాన్ని తనిఖీ చేయడంతో అందులో  26క్వింటాల రేషన్ బియ్యం ఉన్నాయని బండి నెంబర్ ఆధారంగా వల్లెపు అనిల్  … Read more

ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే21:సైదాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నవ భారత నిర్మాత నవ యువతకు స్ఫూర్తి మాజీ ప్రధాని,భారత రత్న స్వర్గీయులు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమశాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్  ఆదేశాల మేరకు సైదాపూర్ మండల కేంద్రంలో కొత్త బస్ స్టేషన్ అవరణలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంత సుధాకర్  ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూల మల వేసి ఘన నివాళి అర్పించడం … Read more