సర్వాయి పాపన్న చరిత్రను దేశానికి చాటి చెప్తాం

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను దేశానికి చాటి చెపుతామని,కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేట గ్రామంలోని సర్వాయి కోటను టూరిజం సర్కిల్ గా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్సైదాపూర్ మండలం సర్వాయిపేట గ్రామంలో రూ.4 కోట్ల 70 లక్షలతో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కోట పర్యాటక అభివృద్ధికి భూమి పూజ చేశారు. సర్వాయిపేట కోటగుట్టపై సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు.అనంతరం  … Read more

ప్రజాకవి నాగుల సత్యం గౌడ్ కు భారత్ వరల్డ్ రికార్డు అవార్డు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజరాబాద్ పట్టణానికి చెందిన మానవ విలువల పరిరక్షణ సేవ సంస్థ జాతీయ అధ్యక్షులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, ఇంటర్నేషనల్ భారత్ ప్రతిభ రత్న అవార్డు గ్రహీత, ప్రజాకవి, రచయిత సామాజికవేత్త డాక్టర్ నాగుల సత్యం గౌడ్ భారత్ వరల్డ్ రికార్డ్ అవార్డు అందుకున్నారు. అంతర్జాతీయ భారత్ వరల్డ్ రికార్డు కమిటీ సత్యం గౌడ్ సామాజిక, ఆధ్యాత్మిక సేవలను సేవలను గుర్తించి, చతుష్టి కలలు, సంక్రాంతి సంబరాలు, గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ప్రపంచ భారత్ … Read more

నువ్వు మగాడివి ఐతే..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారతీరుపై హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి వొడితల ప్రణవ్ తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి,మంత్రుల మీద అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని,పార్టీ మారిన ఎమ్మెల్యేల పట్ల మాట్లాడే కౌశిక్ రెడ్డి నిజంగా మొగోడు అయితే హుజురాబాద్ నియోజకవర్గంలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలిపి చూపించాలని అన్నారు.గత పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం అనేక స్కాంలు చేస్తే,10 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక స్కీములు … Read more

నీళ్లు ఇవ్వకపోతే రైతులతో వచ్చి పంపులు ఆన్ చేస్తా

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో మా అందరిపై కోపం ఉంటే మా మీదే చూపించాలి తప్పా రైతుల మీద కాదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ఆయన మాట్లాడారు. హుజురాబాద్ నియోజకవర్గ రైతులకు నీళ్లు అందగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాలేశ్వరం ప్రాజెక్టు లక్ష్మి పంప్ హౌస్ వద్ద 17 పంపులు రెడీగా ఉన్నాయని వెంటనే … Read more

కేంద్ర బిజెపి ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలం ఆపాలి

కరీంనగర్/ధనాధన్ న్యూస్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలం పాట ఆపాలని,సింగరేణి సంస్థకే నేరుగా కేటాయించాలని సిపిఎం కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు.సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గీతా భవన్ చౌరస్తాలో శనివారం రోజున ప్లకార్డులతో నిరసనచేశారు.కేంద్ర బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి  మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకును కేంద్ర బీజేపీ ప్రభుత్వం వేలం వేస్తున్నదని … Read more

చేగువేరా స్పూర్తితో యువత ఉద్యమించాలి

కరీంనగర్(ధనాధన్ న్యూస్)జూన్14: సామ్రాజ్యవాదుల గుండెల్లో దడ పుట్టించిన విప్లవ దృవతార చేగువేరా అని,ఆయన ఉద్యమ పోరాట స్పూర్తితో నేటి విద్య, ఉపాధి,ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పాలకులపై ఉద్యమించాలని యుగంధర్ పిలుపునిచ్చారు.శుక్రవారం కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్  ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో చేగువేరా 96వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి పూలమాలలు వేశారు.ఈ సందర్భంగా ఎఐవైఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రాహ్మండ్ల పెళ్లి యుగంధర్  మాట్లాడుతూ 1928 జూన్ 14న అర్జెంటీనాలో జన్మించిన చేగువేరా వైద్య, ఇంజనీరింగ్  విద్యలను … Read more

కౌశిక్ రెడ్డిని విమర్శించే స్థాయి ప్రణవ్ ది కాదు

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)జూన్13: హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ ని విమర్శించే స్థాయి ప్రణవ్ కి లేదని బీఆర్ఎస్ సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి అన్నారు. గురువారం హుజరాబాద్ లోని ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వారం రోజులుగా ఫ్లై యాష్ స్కాం గురించి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంత్రి కనుసన్నలోనే స్కామ్ జరుగుతుంది అని ఆధారలతో నిరూపిస్తే ఇప్పటివరకు మంత్రి ఎందుకు స్పందించడం లేదని … Read more

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

సైదాపూర్(ధనాధన్ న్యూస్)జూన్12:ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని అందుకోసం ప్రభుత్వాలు సకల సౌకర్యాలు అందిస్తున్నట్లు ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి తెలిపారు.విద్యా సంవత్సరం ప్రారంభ రోజును పురస్కరించుకుని మండల కేంద్రంలోని వెన్కెపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం రోజున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా విద్యార్థులకు స్కూల్ యూనిఫాం లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ఆది నుండి నేటి … Read more

ఇల్లందకుంట రామాలయానికి వెలిచాల విరాళం

ఇల్లందకుంట(ధనాధన్ న్యూస్)మే28:కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలకేంద్రంలోని రామాలయానికి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు  విరాళం ప్రకటించారు. అపర భద్రాద్రిగా పేరు గాంచిన సీతారామచంద్రస్వామి దేవస్థాన అభివృద్ధికి కాంగ్రెస్ నాయకుడు వెలిచాల రూ.2 లక్షల నగదును మంగళవారం అందజేశారు.

ఖబర్దార్ కేటీఆర్

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే25:మొన్న డిసెంబర్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కేటీఆర్ కు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినప్పటికీ ఇంకా అహం తగ్గలేదని, వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల స్థానానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సామాన్యుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి అసామాన్యుడిగా ఎదిగిన తీన్మార్ మల్లన్నను చూసి ఓర్వలేక ” మీకు బిట్స్ పిలానీ కావాలా.. పల్లి బఠాణి కావాలా..! అంటూ మల్లన్నను ఉద్దేశించి హేళన చేస్తూ మాట్లాడిన కేటీఆర్ ఒళ్ళు … Read more