ఎమ్మెల్యే పై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: సహాచర జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు హేయమైన చర్య అని హుజురాబాద్ కాంగ్రెస్ శ్రేణులు అన్నారు.ఈ మేరకు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ లో అతనిపై ఫిర్యాదు చేశారు.కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రులు,ఎమ్మెల్యేల పట్ల కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు,వాడిన పదజాలం సరిగా లేదని ప్రజా సమస్యల పట్ల … Read more

మా గ్రామాన్ని పట్టించుకోండి మంత్రి గారు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: పాలకులు మారినా…ప్రభుత్వాలు మారినా…ప్రజల ఇబ్బందులు తప్పడం లేదు…కొత్త గ్రామపంచాయతీగా ఆవిర్భవించిన గర్రెపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యము లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యంతో పాటు గ్రామంలో రేషన్ షాపు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దోకిడి తిరుపతి అన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…హుస్నాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయంపై ప్రత్యేకమైన  … Read more

ప్రజాకవి నాగుల సత్యం గౌడ్ కు భారత్ వరల్డ్ రికార్డు అవార్డు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజరాబాద్ పట్టణానికి చెందిన మానవ విలువల పరిరక్షణ సేవ సంస్థ జాతీయ అధ్యక్షులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, ఇంటర్నేషనల్ భారత్ ప్రతిభ రత్న అవార్డు గ్రహీత, ప్రజాకవి, రచయిత సామాజికవేత్త డాక్టర్ నాగుల సత్యం గౌడ్ భారత్ వరల్డ్ రికార్డ్ అవార్డు అందుకున్నారు. అంతర్జాతీయ భారత్ వరల్డ్ రికార్డు కమిటీ సత్యం గౌడ్ సామాజిక, ఆధ్యాత్మిక సేవలను సేవలను గుర్తించి, చతుష్టి కలలు, సంక్రాంతి సంబరాలు, గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ప్రపంచ భారత్ … Read more

పదవుల ప్రకటనతో కాంగ్రెస్ లో నయా జోష్

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజురాబాద్ నియోజకవర్గంలోని హుజురాబాద్,జమ్మికుంట పట్టణ,మండల,వీణవంక,ఇళ్ళందకుంట మండలాల పార్టీ అధ్యక్షుల నియామకం ఆదివారం రోజున జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ,వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి,హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆదేశాలు జారీ చేశారు.ఈ మేరకు నూతనంగా నియమించబడ్డ అధ్యక్షులకు నియామక పత్రాలను అందజేశారు.హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడిగా మేకల తిరుపతి,మండల అధ్యక్షుడిగా కొల్లూరి కిరణ్ కుమార్,జమ్మికుంట పట్టణ అధ్యక్షుడిగా సుంకరి రమేష్,మండల అధ్యక్షుడిగా వీరమనేని పర్శరామరావు,వీణవంక మండల అధ్యక్షుడిగా ఎక్కటి రఘుపాల్ … Read more

ప్రభుత్వ పాఠశాలలోని విద్యుత్ మోటార్ ధ్వంసం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మండలంలోని కోరపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో పీఎంకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విద్యుత్ మోటార్ ను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.పాఠశాలలోని విద్యార్థుల సౌకర్యార్థం మంచినీటి కోసమై పిఎంకె ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోరుతోపాటు మోటార్ మంజూరు చేయించి స్కూల్ యాజమాన్యానికి అప్పగించడం జరిగింది.దీనిలో భాగంగా ఆదివారం గుర్తు తెలియని దుండగులు హైస్కూల్లో ఉన్న మోటార్ ను ధ్వంసం చేయడంతో పాటు సంబంధిత పైపును కట్ చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సమ్మయ్య … Read more

సగరుల అభివృద్ధికి కృషి చేయాలి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: సగరులు ఐకమక్యంతో పని చేస్తూ వారి ఆర్థికఅభివృద్ధికి కృషి చేస్తూ ముందుకెళ్లాలని రాష్ర్ట సగర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర అన్నారు.హుజురాబాద్ పట్టణంలోని కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో సగర సంఘం ఎన్నికలు జరిగాయి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సగరులను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని, సగరుల సమస్యలపై ప్రభుత్వాలపై పోరాటం చేసేందుకు ఐకమత్యంతో ముందుకెళ్లాలని సూచించారు. ఎన్నికలు అనగానే ఎవరూ కూడా వ్యక్తిగతంగా తీసుకోకుండా సోదర భావంతో తీసుకుని ఎన్నికల అనంతరం అందరూ … Read more

మాజీ పీఎం కి ఘన నివాళులు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి డాక్టర్ మన్మోహన్ సింగ్ కి ఘన నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ గొప్ప ఆర్థిక సంస్కర్తను జాతి కోల్పోయిందనీ,మన్మోహన్ సింగ్ మరణం కాంగ్రెస్ పార్టీకే కాదు దేశానికి తీరని లోటని అన్నారు.మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా, మాజీ ప్రధాన మంత్రిగా మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలు దేశం ఏ నాటికి మరిచిపోదనీ తెలిపారు.2004 … Read more

చివరి ఆయకట్టు వరకు సాగునీరందిస్తాం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ డివిజన్ పరిధిలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు రైతులకు అందిస్తామని,కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వమని,రైతులను ఆన్ని విధాలా ఆదుకుంటామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు ఎస్సారెస్పీ పరిధిలో ఉన్నటువంటి రైతులకు జనవరి ఒకటి నుంచి సాగునీరు విడుదల చేస్తామని దానికి సంబంధించిన ప్రణాళికలను అధికారులు రూపొందించారని,ఈ విషయమై ఇప్పటికే అధికారులతో మాట్లాడమని,రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ప్రభుత్వ విద్యార్థుల విజ్ఞాన విహార యాత్రల కోసం స్పెషల్ బస్సులు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: ప్రభుత్వ విద్యాసంస్థలు మరియు గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు విజ్ఞాన విహార యాత్రలకు మరియు సైన్స్ ఫెయిర్ కార్యక్రమాలకు అతి తక్కువ ఖర్చుతో టీజిస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయని సూపర్ లగ్జరీ ఎక్స్ ప్రెస్ మరియు పల్లె వెలుగు వంటి బస్సులు కెపాసిటీ బట్టి వినియోగించుకోవచ్చు.ఈ అవకాశాన్ని ప్రభుత్వ విద్యాసంస్థలు మరియు గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు వినియోగం చేసుకోవాలని,ఆర్టీసీ బస్ లో ప్రయాణం సురక్షితం అని హుజూరాబాద్ … Read more

స్థానిక ఎన్నికల్లో యువతకు అవకాశం ఇవ్వాలి

వీణవంక/ధనాధన్ న్యూస్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేయాలని, పోటీకి అవకాశం కల్పించాలని కాంగ్రెస్ యువ నాయకుడు ప్రశాంత్ మద్దుల కోరారు. బుధవారం ఆయన వీణవంక మండల కేంద్రంలో  మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పదికాలాలపాటు ప్రజా శ్రేయస్సుకు పనిచేయాలంటే గ్రామాల్లో యువతకు చాన్స్ ఇవ్వాలని కోరారు. యువ రక్తం హస్తం పార్టీలో ఉన్నంతగా మరే పార్టీలో లేదని చెప్పారు. హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలో యువతీ యువకులకు లోకల్ బాడీ … Read more