kodandaram
గురువు ఆశీస్సులతో ప్రజాసేవ బాటలోకి అరికిల్ల స్రవంతి
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం శిష్యురాలు అరికిల్ల స్రవంతి తన రాజకీయ ప్రయాణంలో మరో కీలక అడుగు వేశారు.జమ్మికుంట మున్సిపాలిటీ 24వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంగా శనివారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తన రాజకీయ గురువు ప్రొఫెసర్ కోదండరాంను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ,జనసమితి పార్టీ ఆవిర్భావం నుంచే స్రవంతి పార్టీకి వెన్నెముకలా నిలిచిందని అన్నారు.కార్యకర్త స్థాయి నుంచి ప్రారంభమైన … Read more
సర్వాయి పాపన్న చరిత్రను దేశానికి చాటి చెప్తాం
సైదాపూర్/ధనాధన్ న్యూస్: సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను దేశానికి చాటి చెపుతామని,కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేట గ్రామంలోని సర్వాయి కోటను టూరిజం సర్కిల్ గా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్సైదాపూర్ మండలం సర్వాయిపేట గ్రామంలో రూ.4 కోట్ల 70 లక్షలతో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కోట పర్యాటక అభివృద్ధికి భూమి పూజ చేశారు. సర్వాయిపేట కోటగుట్టపై సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు.అనంతరం … Read more
పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: అర్హులైన ప్రతి పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ అన్నారు.హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లబ్దిదారులకు పది లక్షల విలువ చేసే ఎల్.ఒ.సీ లను,సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రమాదవశాత్తు,వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొంది ఆర్థిక భారం భరించలేక ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ భాద్యతగా అండగా ఉంటుందని అన్నారు.సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు చేసిన సందర్భంగా సీఎం రేవంత్ … Read more
ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా ఇక లేరు
హైదరాబాద్/ధనాధన్ న్యూస్: డిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కన్నుమూశారు.నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన శనివారం(అక్టోబర్ 12) తుది శ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై పదేళ్లు జైలు శిక్ష అనుభవించిన సాయిబాబా ఈమధ్యనే జైలు నుంచి విడుదల అయ్యారు.నక్సలైట్లతో చేతులు కలిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని 2014లో మహారాష్ట్ర పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు.ఈ కేసులో 2017లో గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఆయనతో పాటు మరో ఆరుగురికి … Read more
భవిష్యత్తు మున్నేరుపాలు..!!
ఖమ్మం/ధనాధన్ న్యూస్: ఒకరు కాదు..ఇద్దరు కాదు..సుమారు 500 మంది విద్యార్థుల విద్యార్హతల సర్టిఫికెట్లు మున్నేరుపాలయ్యాయి.టెన్త్ మొదలు పీజీ వరకు పూర్తి చేసిన విద్యార్థులే కాక కొందరు ఉద్యోగాలు చేస్తున్న వారి సర్టిఫికెట్లు సైతం వరదలో కొట్టుకుపోయాయి.దీంతో వారంతా దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు.ఖమ్మం నగరం,ఖమ్మం రూరల్ మండలాన్ని మున్నేరు వరద ముంచెత్తగా 50 కాలనీల్లోకి నీరు చేరింది. అందులో కొన్ని ఇళ్లు కొట్టుకుపోగా..కొన్ని నేలమట్టమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున మున్నేరు వరద చుట్టుముట్టడంతో బాధితులు కట్టుబట్టలతో వెళ్లిపోయారు. వరద తగ్గాక … Read more
పదేండ్ల మోడీ పాలనలో పౌర హక్కులు హరించబడ్డాయి
హుజురాబాద్(ధనాధన్ న్యూస్)మే11:ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసమే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని,నరేంద్ర మోడీ ని ఓడించాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రజాస్వామ్యవాదులకు పిలుపునిచ్చారు.శనివారం పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్లో “ప్రమాదంలో భారత ప్రజాస్వామ్యం”అనే సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు,బలహీన వర్గాల సంక్షేమం,సామాజిక న్యాయానికి మన రాజ్యాంగం పెద్దపీట వేసిందని,అలాంటి రాజ్యాంగాన్ని రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ ప్రమాదంలో పడవేసే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం … Read more
తెలంగాణ జన సమితి
పార్లమెంటరీ కమిటీ నియామకం
పార్లమెంటరీ ఇంచార్జి ముక్కెర రాజు పార్లమెంటరీ కో ఆర్డినేటర్ అరికిల్ల స్రవంతి కరీంనగర్(ధనాధన్ న్యూస్)మే 06:పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ జన సమితి పార్టీ కరీంనగర్ పార్లమెంటరీ కమిటీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. కరీంనగర్ పార్లమెంటరీ కమిటీ ఇంచార్జి గా ముక్కెర రాజు,కో ఆర్డినేటర్ గా జగ్గారెడ్డి,అరికిల్ల స్రవంతి, కర్రే సతీష్ యాదవ్,మోరే గణేష్,పల్లెర్ల శ్రీనివాస్,రమేష్ లను నియమించడం జరిగింది.తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ తో పొత్తు లో భాగంగా ప్రస్తుతం … Read more
అవినీతి పోవాలంటే- సామాన్యుడు మారాలి
న్యూస్ డెస్క్(ధనాధన్ న్యూస్)మే03:నేటి సమాజ పరిస్థితి ఎలా తయారయింది అంటే..! మనం మారద్దు కానీ మార్పు రావాలి, అవినీతి లేని సమాజం కావాలి, ప్రభుత్వాల ద్వారా ఉచితాలు రావాలి, మనం ఏం పని చేయొద్దు, మన ఇంటి వద్దకే అన్ని రావాలి, కానీ ఓటు వేసేటప్పుడు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే మా ఓటు… మరి డబ్బులు తీసుకొని ఓటు వేసినప్పుడు మనం కోరుకునే అవినీతి రహిత సమాజం ఎలా ఏర్పడుతుంది. ఎవరో రావాలి ఏదో … Read more
విద్యా ఉపాధి రంగాల్లో మహిళలకు అవకాశాలు కల్పించాలి
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని,రాష్ట్రం లో వెంటనే మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ జన సమితి మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు రాగులపెల్లి లక్ష్మి డిమాండ్ చేశారు.మహిళా జన సమితి ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యాలయం లో నిర్వహించిన మహిళా సదస్సులో వారు మాట్లాడుతూ దేశంలో,రాష్ట్రంలో ఇంకా మహిళలు రెండవరకం పౌరులుగానే చూడబడుతున్నారని,సమాన పనికి సమాన వేతనం ఇంకా పొందలేకపోతున్నారని తెలిపారు. ఎన్నికల సమయాల్లో మహిళను మహారాణులను చేస్తామంటూ ఉదార … Read more