అంగ రంగవైభవంగా ద్వితీయ వార్షికోత్సవం
జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే15:జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామంలో గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.వేడుకల్లో భాగంగా మంగళవారం నాడు ఉదయం విశ్వక్ సేన ఆరాదన,పుణ్యవచనం,రక్షా బంధనం,నవ కలుష స్థపనం,మహా హోమం తో ప్రారంభమై సాయంత్రం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు.ఈ కళ్యాణ మహోత్సవం అధ్యంతం వైభవంగా,కన్నుల పండుగగా జరిగింది.రాములోరి కల్యాణానికి దాతలు పట్టు వస్త్రాలు,పూలు సమర్పించారు.అనంతరం ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు.కళ్యాణ వేడుకతో గ్రామమంతా రామనామస్మరణతో మారూమ్రోగింది.ప్రతీ … Read more