మక్క కొనుగోళ్లలో జాప్యం.. రైతుల ఆగ్రహం

సైదాపూర్/ధనధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన మొక్కజొన్న రైతులు కొనుగోలు కేంద్రాల నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ పది రోజుల్లో మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, స్థానిక టెండర్ యజమాని నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సంచుల కొరత కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రోజులు గడుస్తున్నా పంట కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగడం లేదని వాపోతున్నారు. … Read more

ఇసుక కొరతతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు బ్రేక్

సైదాపూర్/ధనాధన్ న్యూస్,మే 25:ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ… మరోవైపు ఇసుక ఆన్‌లైన్ సమస్యలు లబ్ధిదారులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఇసుక అందుబాటులో లేక ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల పాటు ఇసుక ఆన్‌లైన్‌లు అందుబాటులో లేకపోవడం, అనంతరం ఒక్కసారిగా భారీ సంఖ్యలో అనుమతులు జారీ కావడంతో ట్రాక్టర్లు, కార్మికులు … Read more

దారి దోపిడీ కేసు ఛేదన

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ మే 21:కోరపల్లి గ్రామ రహదారిపై ఇటీవల చోటుచేసుకున్న దోపిడీ ఘటనను జమ్మికుంట పోలీసులు వేగంగా ఛేదించి, ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు హుజురాబాద్ ఏసీపీ వి. మాధవి తెలిపారు. గురువారం జమ్మికుంట పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె కేసు వివరాలను వెల్లడించారు.పోలీసుల కథనం ప్రకారం, మే 20వ తేదీ రాత్రి కోరపల్లి గ్రామం వైపు వెళ్తున్న అశోక్ లేలాండ్ వాహనం (టీఎస్ 08 యూడీ 5457)ను 11 మంది … Read more

రాత్రివేళ ఆటో ట్రాలీని అడ్డగించి నిలువు దోపిడీ

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరిపై దాడి చేసి నగదు, బంగారు ఉంగరం దోచుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం తూర్పాయగూడెంకు చెందిన నల్లమల్ల ఆంజనేయులు (45) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ నెల 20న ఆవుల రాములు అనే వ్యక్తి ఆటో ట్రాలీని కిరాయికి తీసుకొని పెద్దపల్లి జిల్లా పొత్కపల్లికి వెళ్లి మూడు ఎడ్లను కొనుగోలు చేశారు. అనంతరం వాటిని ఆటో … Read more

ప్రణాళికాబద్ధంగా చదివితేనే ఉత్తమ ఫలితాలు సాధ్యం

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని ఆకునూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను గురువారం ఘనంగా సన్మానించారు. తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మండ్ల భాస్కర్ విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారికి, వారి తల్లిదండ్రులకు శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు. ఆకునూరు పాఠశాల విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ … Read more

రెండో విడుత గొర్రెల పంపిణీ పథకం పునరుద్ధరించాలి

సైదాపూర్/ధనాధన్ న్యూస్: రాష్ట్రంలోని గొల్ల, కురుమల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచిన గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రభుత్వం తిరిగి ప్రారంభించాలని మండల కురుమ సంఘం యూత్ అధ్యక్షుడు మునిపాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో సబ్సిడీపై గొర్రెల యూనిట్లు పంపిణీ చేయడంతో వేలాది కుటుంబాలు స్వయం ఉపాధి దిశగా ముందడుగు వేసినట్లు తెలిపారు. మొదటి విడతలో లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు అందించినప్పటికీ, రెండో విడత అమలు … Read more

బండి భగీరథ్ అరెస్టుకు టీజేఎస్ మహిళా విభాగం డిమాండ్

హైదరాబాద్/ధనాధన్ న్యూస్ మే 16:మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని తెలంగాణ జన సమితి (టీజేఎస్) మహిళా విభాగం రాష్ట్ర మహిళా కమిషన్‌ను కోరింది. ఈ మేరకు టీజేఎస్ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అరికిల్ల స్రవంతి, ముత్తు గీతాంజలి, మహిళా నాయకురాలు లావణ్య శనివారం మహిళా కమిషన్ చైర్మన్‌కు వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రంలో వారు పేర్కొన్నదేమిటంటే… బాధిత మైనర్ … Read more

సిరిసేడు హైస్కూల్‌లో పదవ తరగతి విద్యార్థులకు ఘన సన్మానం

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్: ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు ప్రభుత్వ హైస్కూల్‌లో ఈ విద్యా సంవత్సరంలో పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రేణుకుంట్ల శ్యామల కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ ప్రైజ్ మనీ అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ ఫస్ట్ సాధించిన విద్యార్థికి రూ.5,000, స్కూల్ సెకండ్ వచ్చిన విద్యార్థికి రూ.3,000, స్కూల్ థర్డ్ స్థానం పొందిన విద్యార్థికి రూ.2,000 నగదు బహుమతులను అందించారు. విద్యార్థులు … Read more

ప్రవేట్ పాఠశాల వద్దు..గవర్నమెంట్ పాఠశాల ముద్దు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా “జయశంకర్ బడిబాట” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీ చేపట్టారు.ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం బొట్ల రామస్వామి మాట్లాడుతూ, ప్రతి తల్లిదండ్రులు తమ బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ద్వారా నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు … Read more

అదనపు కట్నం కోసం వేధింపులు.. నలుగురిపై కేసు నమోదు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ మే 10: అదనపు కట్నం తీసుకురావాలని కోడలిని వేధించిన భర్తతో పాటు అత్తమామలు, బంధువులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మడిపల్లి గ్రామానికి చెందిన ఇగ్గేటి అనూష (26)కు గత ఏడాది ఉల్లంపల్లి గ్రామానికి చెందిన బుల్లి అజయ్‌కుమార్‌తో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వివాహ సమయంలో వధువు కుటుంబ సభ్యులు ఎకరం భూమి, రూ.8 లక్షల నగదు, ఇతర లాంఛనాలతో ఘనంగా పెళ్లి జరిపించినట్లు తెలిపారు. పెళ్లి … Read more