దళితుల పట్ల కౌశిక్ రెడ్డికి వివక్ష తగ్గదు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: దళితుల పట్ల కౌశిక్ రెడ్డి వివక్ష చూపెట్టడం తగదని,నాలుగు దశాబ్దాల పాటు రాజకీయ ప్రస్థానంలో ఉన్న సీనియర్ నాయకుడు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల శాసన సభ వేదికగా కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు అసభ్యకరమని,దీనిపై వెంటనే కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ డిమాండ్ చేశారు.ఈ మేరకు ఆయన కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. కౌశిక్ రెడ్డి దళితులపై … Read more

ఎర్ర పడ్డ ఆకాశం…ఆస్ట్రేలియాలో భయానక దృశ్యం

న్యూస్ డెస్క్: పశ్చిమ ఆస్ట్రేలియాలో శనివారం ఒక అరుదైన సహజ ఘటన ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.షార్క్ బే, డెన్హామ్ ప్రాంతాల్లో పగటిపూట ఆకాశం అకస్మాత్తుగా ముదురు ఎరుపు రంగులోకి మారింది.ఈ ఘటనను చూసిన స్థానికులు మొదట భయాందోళనకు గురయ్యారు.ఆకాశం పూర్తిగా రక్తవర్ణంలో కనిపించడంతో సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. వాతావరణ నిపుణుల ప్రకారం, ఈ ఘటనకు కారణం నరెల్ ఉష్ణమండల తుఫాను.ఈ తుఫాను ప్రభావంతో ఎడారి ప్రాంతాల్లోని ఎర్రటి ధూళి గాలిలోకి ఎగిసింది.ఆ ప్రాంతంలో ఇనుము … Read more

కమీషన్ల కోసమే బల్దియా టెండర్ల రద్దా..? కరీంనగర్‌లో రాజకీయ వేడి

కరీంనగర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ నగర పాలక సంస్థలో టెండర్ల రద్దు వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. విలీన గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో చేపట్టాల్సిన పనులు నిలిచిపోవడంతో వివాదం చెలరేగింది.ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం విలీన గ్రామాల అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులను మంజూరు చేసి, రోడ్లు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాల కోసం టెండర్లు పిలిచింది. దాదాపు 87 అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లు ఆన్లైన్‌లో … Read more

వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో శ్రీరామ నవమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించగా, గ్రామం మొత్తం శ్రీరామ నామస్మరణతో మారుమోగింది. భక్తాంజనేయ ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, పట్టు వస్త్రాలు మరియు ముత్యాల తలంబ్రాలు సమర్పించి వేదమంత్రాల నడుమ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, రామాయణంలో వశిష్ట మహర్షి శ్రీరాముడికి నామకరణం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. … Read more

మీ బండిలో పెట్రోల్ కొట్టించే ముందు ‘డెన్సిటీ’ చూస్తున్నారా? లేదంటే నిలువు దోపిడీయే!

న్యూస్ డెస్క్: ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఒకటే చర్చ.. పెట్రోల్ బంకుల్లో మన కళ్లముందే మోసం జరుగుతోందని! ముఖ్యంగా “డెన్సిటీ” (Density) అనే పదం వినబడగానే చాలా మంది వాహనదారులు కంగారు పడుతున్నారు. అసలు ఈ డెన్సిటీ అంటే ఏమిటి? బంకుల్లో మోసాన్ని దీనితో కనిపెట్టవచ్చా? లెట్స్ నో ది ఫ్యాక్ట్స్! డెన్సిటీ అంటే ఏమిటి?సింపుల్‌గా చెప్పాలంటే, డెన్సిటీ అంటే ద్రవ పదార్థం యొక్క సాంద్రత. పెట్రోల్ లేదా డీజిల్ ఎంత స్వచ్ఛంగా ఉందో చెప్పే … Read more

“అధిక దిగుబడి ఇచ్చే మొక్కజొన్న కొత్త రకం..నూజివీడు సీడ్స్ క్షేత్ర ప్రదర్శన”

కోనారావుపేట/ధనాధన్ న్యూస్:రైతులకు మెరుగైన పంట దిగుబడులపై అవగాహన కల్పించే ఉద్దేశంతో Nuziveedu Seeds ఆధ్వర్యంలో మొక్కజొన్న పంటపై రైతు క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమం మంగళపల్లి గ్రామానికి చెందిన రైతు వెలిశాల నర్సయ్య వ్యవసాయ క్షేత్రంలో జరిగింది. ఈ సందర్భంగా Winner NMH-8352 మొక్కజొన్న రకాన్ని ప్రదర్శించారు. కార్యక్రమానికి హాజరైన కరీంనగర్ ఏరియా మేనేజర్ నీలా రాజు మాట్లాడుతూ, నూజివీడు సీడ్స్ రైతు సేవలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం గర్వకారణమని తెలిపారు. Winner NMH-8352 … Read more

అసెంబ్లీ ముట్టడికి వెళ్తుండగా ముందస్తు అరెస్ట్ – వడ్డెర సంఘం నేత ఆగ్రహం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: తెలంగాణ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించనున్న అసెంబ్లీ ముట్టడికి వెళ్తుండగా, వడ్డెర సంఘం జమ్మికుంట మండల అధ్యక్షుడు పల్లపు రవిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పల్లపు రవి మాట్లాడుతూ, వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు అయ్యేవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా వెనక్కి తగ్గబోమని హెచ్చరించారు.అలాగే, వడ్డెర కులాన్ని ఎస్టీ (ST) జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. … Read more

ఉద్యమకారుల హామీలు నెరవేర్చాలి

జమ్మికుంట/ధనధన్ న్యూస్: తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, అక్రమ అరెస్టులకు పాల్పడటం తీవ్రంగా ఖండనీయమని బీఆర్ఎస్వీ టౌన్ ప్రెసిడెంట్ కొమ్ము నరేష్ అన్నారు. ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా “ఆరు గ్యారంటీలు” ప్రకటించిందని గుర్తుచేశారు. అందులో ఉద్యమకారులకు గుర్తింపు కార్డు,250 గజాల ఇల్లు స్థలం, ₹25,000 పెన్షన్ ఇవ్వాలని హామీ ఇచ్చినప్పటికీ, రెండున్నర సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు అమలు కాలేదని విమర్శించారు. ఈ హామీల … Read more

మత మార్పిడి తర్వాత ‘ఎస్సీ’ స్టేటస్ చెల్లుతుందా? ఏపీ హైకోర్టు సంచలన తీర్పు!

న్యూస్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల ఒక కీలక కేసులో సంచలన తీర్పు వెలువరించింది. మత మార్పిడి చేసుకున్న వ్యక్తులకు షెడ్యూల్డ్ కులాల (SC) రిజర్వేషన్లు మరియు చట్టపరమైన రక్షణలు వర్తిస్తాయా లేదా అనే అంశంపై కోర్టు పూర్తి స్పష్టతనిచ్చింది. అసలేం జరిగింది?గుంటూరు జిల్లాకు చెందిన పాస్టర్ ఆనంద్ అనే వ్యక్తి, తనను కొందరు కులం పేరుతో దూషించారని మరియు దాడి చేశారని 2021లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు ఆరుగురిపై SC/ST అట్రాసిటీ … Read more

మండుతున్న ఎండలు..మండిపోనున్న ఏసీ ధరలు: కొనే ప్లాన్ ఉంటే ఇప్పుడే బెస్ట్!

తెలుగు రాష్ట్రాల్లో భానుడు అప్పుడే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువవుతుండటంతో, సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఏసీల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఈ ఏడాది ఏసీ కొనాలనుకునే వారికి ఒక చేదు వార్త వినిపిస్తోంది. ముడి సరుకుల ధరలు పెరగడం మరియు గిరాకీ ఒక్కసారిగా ఊపందుకోవడంతో ప్రముఖ కంపెనీలు ఏసీల ధరలను 5% నుండి 10% వరకు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఎందుకు ధరలు పెరుగుతున్నాయి?ముడి … Read more