సిరిసేడు గ్రామంలో ప్రత్యేక గ్రామసభ… ప్రభుత్వ పథకాలపై అవగాహన

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్:ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ రేణికుంట్ల శ్యామల-కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.కార్యక్రమం ప్రారంభంలో తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను ఆలపించారు. అనంతరం ముఖ్యమంత్రి సందేశాన్ని గ్రామస్తులకు ప్రదర్శించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు హాజరై తమ శాఖలకు … Read more

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వెంకటేశ్వర్లపల్లిలో గ్రామ సభ

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో గురువారం గ్రామ సర్పంచ్ రాయిచెట్టి చంద్రయ్య ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ రాయిచెట్టి చంద్రయ్య మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామానికి తాజాగా 27 కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. అలాగే వితంతు, వికలాంగులు, వృద్ధాప్య పింఛన్లు అర్హులందరికీ అందేలా … Read more

డంపింగ్ యార్డు స్థల మార్పిడికి కట్టుబడి ఉన్నాం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన డంపింగ్ యార్డు స్థలాన్ని మార్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ తెలిపారు. గురువారం పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తన ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని ఆరోపిస్తూ, ఆయనను వెంటనే ఎమ్మెల్యే పదవి నుంచి భర్తరఫ్ చేయాలని ప్రణవ్ డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో రీల్స్, లైకులు పొందడానికే పరిమితమై, ప్రజా సమస్యల … Read more

3న హుజూరాబాద్ బంద్‌

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ సమీపంలోని సిర్సపల్లి గ్రామంలో ప్రతిపాదించిన వెస్ట్ టు ఎనర్జీ (WTE) డంపింగ్ యార్డు ప్రాజెక్టుపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు అమలు వల్ల పరిసర ప్రాంతాల్లో 20 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో గాలి, నీరు, ఆహారం కలుషితమయ్యే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. దీని ప్రభావంతో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. … Read more

హుజూరాబాద్‌లో మున్సిపల్ కార్మికుల నిరసన – లేబర్ కోడ్ల రద్దు కోరుతూ ఆందోళన

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్‌లో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని అటెండెన్స్ పాయింట్ వద్ద మున్సిపల్ కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అలాగే 2021 సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. … Read more

హుజూరాబాద్‌కు మరిన్ని బస్ సర్వీసులు – మంత్రిని కలిసిన ప్రణవ్

హైదరాబాద్/ధనా ధన్ న్యూస్: హుజూరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు కొత్త బస్ సర్వీసులను మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రిని కోరారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. నియోజకవర్గంలోని బస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, సమస్యలను పరిశీలించి … Read more

పాడి కౌశిక్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని మాదిగ హక్కుల దండోరా డిమాండ్

హైదరాబాద్/ధనాధన్ న్యూస్:  తెలంగాణ అసెంబ్లీ వేదికగా చోటుచేసుకున్న తాజా పరిణామాలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రసంగిస్తున్న సమయంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, కౌశిక్ రెడ్డిని వెంటనే ఎమ్మెల్యే పదవి నుండి బర్తరఫ్ చేయాలని మాదిగ హక్కుల దండోరా(ఎమ్ హెచ్ డి ) డిమాండ్ చేస్తోంది.నిండు సభలో ఒక దళిత ఎమ్మెల్యేతో బి ఆర్ … Read more

“దోమల వేట.. ఒక పక్కా సైంటిఫిక్ ప్లాన్!”

మీరు గమనించారా? అందరూ కలిసి కూర్చున్నా, దోమలు మాత్రం మిమ్మల్నే ఎక్కువగా కుడుతుంటాయి. “నా రక్తం తీపి అందుకే కుడుతున్నాయి” అని మనం సరదాగా అనుకుంటాం కానీ, దీని వెనుక అసలు కారణాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు! సైన్స్ అడ్వాన్సెస్ (Science Advances) పరిశోధన ప్రకారం దోమలు ఒక పక్కా ప్లాన్ ప్రకారం మనపై దాడి చేస్తాయట. 1. 50 అడుగుల దూరం నుండే పసిగట్టే ‘స్నిపర్’ లాంటి చూపు!మనం శ్వాస వదిలినప్పుడు వచ్చే కార్బన్ డయాక్సైడ్ … Read more

సీనియర్ జర్నలిస్టు ఏబూసి శ్రీనివాస్‌కు నంది అవార్డు ప్రదానం

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు, మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఏ. బూసి శ్రీనివాస్‌కు ప్రతిష్టాత్మకమైన తెలుగు వెలుగు జాతీయ ఉగాది పురస్కార్ – నంది అవార్డు ప్రదానం చేశారు. సామాజిక సేవ, పత్రికా రంగాల్లో ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారు.తెలుగు వెలుగు సాహితీ వేదిక (జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ) ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు వెలుగు జాతీయ ఉగాది సాహితీ–సాంస్కృతిక ఉత్సవాలు … Read more

ఆధ్యాత్మిక సేవలకు గౌరవం..డా.నాగుల సత్యం గౌడ్‌కు జాతీయ పురస్కారం

ప్రజాకవి, తత్వవేత్త, ఆధ్యాత్మిక విశ్వ గురువు బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్యం గౌడ్‌కు జాతీయ స్థాయి “ఆధ్యాత్మిక విజ్ఞాన జ్యోతి” పురస్కారం అందజేశారు.ఈ కార్యక్రమం కరీంనగర్‌లోని ఫిలిం భవన్‌లో ఘనంగా నిర్వహించారు.సామాజిక సేవ, ఆధ్యాత్మిక సేవ, రచనా రంగాల్లో ఆయన చేసిన కృషిని గుర్తించి ఈ అవార్డు ప్రదానం చేశారు.మానవ విలువల పరిరక్షణలో ఆయన చేస్తున్న సేవలు విశేషంగా నిలిచాయి.తెలుగు వెలుగు సాహితీ వేదిక, తెలుగు ఇండియన్ కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, శ్రీ విరాట్ విశ్వకర్మ … Read more