కార్యకర్తలకు అండగా భారత రాష్ట్ర సమితి పార్టీ

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే29:సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన  బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్త పిన్ రెడ్డి రాంరెడ్డి  మరణించగా భారత రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా ద్వారా మంజూరైన 2 లక్షల విలువైన చెక్కును నామినీ గా ఉన్న ఆయన భార్య పద్మ కుటుంబసభ్యుల సమక్షంలో మాజీ  ఎమ్మెల్యే సతీష్ కుమార్  అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ  భారత రాష్ట్ర సమితి ప్రతి కార్యకర్తగా అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు […]

ఖబర్దార్ కేటీఆర్

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే25:మొన్న డిసెంబర్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కేటీఆర్ కు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినప్పటికీ ఇంకా అహం తగ్గలేదని, వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల స్థానానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సామాన్యుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి అసామాన్యుడిగా ఎదిగిన తీన్మార్ మల్లన్నను చూసి ఓర్వలేక ” మీకు బిట్స్ పిలానీ కావాలా.. పల్లి బఠాణి కావాలా..! అంటూ మల్లన్నను ఉద్దేశించి హేళన చేస్తూ మాట్లాడిన కేటీఆర్ ఒళ్ళు […]

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

వీణవంక(ధనాధన్ న్యూస్)మే13:పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సోమవారం హుజురాబాద్ నియోజకవర్గం లోని సొంత గ్రామం వీణవంక లోని ప్రభుత్వ పాఠశాలలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, భార్య శాలిని తోపాటు కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కౌశిక్ రెడ్డి తల్లిదండ్రులు సాయినాథరెడ్డి,శైలజ సోదరుడు కార్తీక్ రెడ్డి ,సంతోషిని దంపతులు ఓటు వేశారు. అనంతరం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును […]

ఎంపీగా వినోద్ కుమార్ ను గెలిపిస్తే మీ తోడుగా మేమిద్దరం ఉంటాం

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే06:తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోని మోసగాడని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం హుజరాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన రోడ్ షో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు.ఆరు గ్యారెంటీలు అమలు చేశామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఎవరికి అమలు చేశారో కూడా చెప్పాలన్నారు.మహిళలకు 2500 పెన్షన్, […]

అవినీతి పోవాలంటే- సామాన్యుడు మారాలి   

న్యూస్ డెస్క్(ధనాధన్ న్యూస్)మే03:నేటి సమాజ పరిస్థితి ఎలా తయారయింది అంటే..! మనం మారద్దు కానీ మార్పు రావాలి, అవినీతి లేని సమాజం కావాలి, ప్రభుత్వాల ద్వారా ఉచితాలు రావాలి, మనం ఏం పని చేయొద్దు, మన ఇంటి వద్దకే అన్ని రావాలి, కానీ ఓటు వేసేటప్పుడు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే మా ఓటు… మరి డబ్బులు తీసుకొని ఓటు వేసినప్పుడు మనం కోరుకునే అవినీతి రహిత సమాజం ఎలా ఏర్పడుతుంది. ఎవరో రావాలి ఏదో […]

పోలీసులకు పుష్ప 3 సినిమా ట్రైలర్ చూపించిన జాదుగాడు

ఖమ్మం(ధనాధన్ న్యూస్)మే 01:పోలీసుల కళ్లుగప్పి నోట్ల కట్టల్ని తరలించడానికి కొత్తకొత్త మార్గాల్ని ఎంచుకుంటున్నారు లీడర్లు. అలాంటి చావు తెలివి తేటలతో డబ్బు తరలిస్తూ దొరికిపోయాడు ఓ యువకుడు.అది కూడా పుష్ప మూవీ తరహాలో కానీ,పోలీసుల ముందు అతడి ఆటలు చెల్లలేదు.ఖమ్మంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు 15లక్షల రూపాయలతో పట్టుబడ్డాడు నిందితుడు.ముందు పోలీసులకు అనుమానమే రాలేదు.కానీ,కొంచెం తేడాగా ఉండటంతో అతడ్ని తనిఖీ చేశారు.అంతే,కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి.ముందు,ప్యాంట్‌ జేబుల్లో నుంచి నోట్ల కట్టల్ని బయటికి తీశాడు.ఆ తర్వాత […]

తెలంగాణ కు మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమే

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 30:దేవుడు గుడిలో ఉండాలి ,భక్తి గుండెల్లో ఉండాలి అంతేకానీ రాముని పేరు చెప్పుకొని హిందూ సాంప్రదాయానికి మాయని కి మచ్చలు వచ్చే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారని ,అయోధ్య రామాలయం పూర్తికాకముందే రాములోరి అక్షింతలను 15 రోజుల ముందు పంపిణీ చేసి హిందూ సాంప్రదాయాలను మంటగలిపిన ఘన చరిత్ర ప్రధాని మోడీకే దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు.మంగళవారం రోజు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ […]

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

ఇల్లందకుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్24:హుజరాబాద్ నియోజకవర్గంలో బుధవారం వివిధ వివాహ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రమాదంలో గాయపడ్డ యువకుడ్ని గుర్తించి దగ్గరుండి ఆసుపత్రికి పంపించి మానవత్వం చాటుకున్నారు.వివరాలు ఇలా ఉన్నాయి.నియోజకవర్గంలోని పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఓ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు మర్రిపల్లిగూడెం నుంచి కన్నూరుకి వెళ్తుండగా మార్గమధ్యంలో ట్రాక్టర్ ఢీకొని మధు అనే యువకుడు తీవ్రంగా గాయపడటాన్ని గమనించిన ఎమ్మెల్యే తన కాన్వాయ్ […]

యువతరమా జర మేలుకో..నీ దేశాన్ని ఏలుకో..!

ఎడిటర్ డెస్క్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్23:ఓ పక్క దేశంలో ఎన్నికలు జరుగుతుంటే, యువత క్రికెట్ సంబరాల్లో మునిగిపోతుంది.. రాజకీయపార్టీలకు బాండ్ల రూపంలో వందలకోట్లు విరాళాలు సమర్పించే కార్పొరేట్ వ్యవస్థలు ఈ దేశ సంపదను దోచుకుంటుంటే! అవేమి పట్టనట్టుగా యువత క్రికెట్ మ్యాచ్ లను వీక్షిస్తున్నారు.రక్షించేవాడు లేక చెరువులు, భూములు కబ్జాల పాలవుతుంటే! అడిగేవాడే లేదని విర్రావీగుతున్న అవినీతి నాయకుల అకలి, మనుషుల శవాలను తిన్నా తీరేది కాదు.. రాజకీయాల్లో రాణించాలన్న ఆశ, దేశ ప్రజల పక్షాన నిల్చోవాలన్న కోరిక లేని […]

చేనేత కార్మికుల కష్టాలు వింటే గుండె బరువెక్కుతుంది

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్23:చేనేతల పరిస్థితి చూస్తే మనసు చలించిపోతుందని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వాడి కౌశిక్ రెడ్డి అన్నారు అన్నారు.మంగళవారం జమ్మికుంటలోని చేనేత సొసైటీ పర్యవేక్షణలో భాగంగా ఆయన మాట్లాడారు.జమ్మికుంట లోని చేనేత సంబంధించి సొసైటీ పర్యవేక్షణకు వస్తే సుమారు 80 లక్షల స్టాక్ మిగిలి ఉందని దీంతో పాటు హుజరాబాద్ నియోజకవర్గం లో అన్ని సొసైటీలను కలుపుకొని సుమారు 6 కోట్ల స్టాకు కొనుగోలు చేయకుండా మిగిలి ఉందని అన్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 15 కోట్ల వరకు […]