11 గంటలకు ఫలితాల రిలీజ్ – ఒక్క మెసేజ్‌తోనే రిజల్ట్ చెక్!

హైద్రాబాద్/ధనాధన్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది ఇంటర్ విద్యార్థులు ఎదురుచూస్తున్న కీలక ఘట్టం ఇవాళనే!ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలను ఇవాళ ఉదయం 11 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా కలిసి ఫలితాలను విడుదల చేయనున్నారు.💻 విద్యార్థులు తమ ఫలితాలను సులభంగా ఈ అధికారిక వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు:👉 https://www.tgbie.cgg.gov.in � అంతేకాకుండా, ఇప్పుడు రిజల్ట్ తెలుసుకోవడం … Read more

వి.ఎస్.ఆర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా వార్షిక సాంస్కృతికోత్సవాలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ మండలం సింగాపురం గ్రామంలోని వి.ఎస్.ఆర్ డిగ్రీ కళాశాలలో వార్షిక సాంస్కృతికోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణం విద్యార్థుల కళా ప్రదర్శనలతో కళకళలాడింది. విద్యార్థులు నృత్యాలు, సంగీతం, నాటికలు వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించారు. కార్యక్రమంలో భాగంగా అతిథుల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన ప్రముఖులు, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించడంతో పాటు వారి ప్రతిభ, … Read more

ఘనంగా జ్యోతిభా పూలే జయంతి వేడుకలు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఉడిగె విజయ ముఖ్య అతిథిగా హాజరై, మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉడిగె విజయ మాట్లాడుతూ, మహనీయుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు బోరగళ్ళ … Read more

ఇన్‌స్టాగ్రామ్ పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో మోసం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో మోసం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. కాపులపల్లి కోరపల్లి గ్రామానికి చెందిన పల్లె అంజలి (25), భర్త బైరెడ్డి విక్రమ్ రెడ్డి, ఈ మేరకు పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల వివరాల ప్రకారం, ఫిర్యాదుదారు మార్చి 10న మధ్యాహ్నం ఇన్‌స్టాగ్రామ్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగాల కోసం వెతుకుతుండగా, ఒక పేజీ ద్వారా సంప్రదింపులు జరిగాయి. అందులో భాగంగా టాస్కులు ఇచ్చి రివ్యూలు నమోదు చేసి పోస్టు చేయాలని, ఒక్కో టాస్క్‌కు … Read more

వేసవి తీవ్రత నేపథ్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: పెరుగుతున్న వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజల ఆరోగ్య రక్షణ కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని THR టీం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు హరీష్ వర్మ అప్పని ప్రభుత్వాన్ని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటంతో సాధారణ ప్రజలు, కూలీలు, రైతులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజలకు ఉపశమనం కల్పించే విధంగా పట్టణాలు, గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్‌లు, మార్కెట్ ప్రాంతాలు, ఆసుపత్రులు వంటి జనసమ్మర్థం … Read more

కల్వరి టెంపుల్‌లో ఘనంగా ఈస్టర్ వేడుకలు

హుజూరాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ మండలంలోని రంగాపూర్ గ్రామంలో ఉన్న కల్వరి టెంపుల్‌లో ఈస్టర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక సంఘ కాపరి పాస్టర్ నెల్సన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరిపారు.ఈస్టర్ పర్వదినం సందర్భంగా, గుడ్ ఫ్రైడే నాడు యేసు క్రీస్తు శిలువపై మరణించి, ఆదివారం తిరిగి లేచిన దినాన్ని పునరుత్థాన ఈస్టర్‌గా భావిస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో సభాధ్యక్షుడిగా బండ రమేష్ వ్యవహరించి కార్యక్రమాన్ని సమర్థంగా … Read more

మహనీయుల జయంతులను ఘనంగా నిర్వహించాలి

హుజూరాబాద్/ధనాధన్ న్యూస్: ఏప్రిల్ నెలను “మహనీయుల పండగ నెల”గా గుర్తించి, వారి జయంతులను ఘనంగా నిర్వహించాలని దళిత రత్న వడ్డూరి కుమారస్వామి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “ఏప్రిల్ నెల అంటే కేవలం ‘ఏప్రిల్ ఫూల్’ మాత్రమే కాదు, దేశ చరిత్రలో చిరస్మరణీయులైన మహనీయులు జన్మించిన గొప్ప నెల” అని పేర్కొన్నారు. భారతదేశానికి విశేష సేవలు అందించిన మహానుభావులలో, అగ్రవర్గ ఆధిపత్యాన్ని ఎదిరించి హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చిన ప్రముఖ నాయకుడు … Read more

హుజూరాబాద్‌లో డంప్ యార్డ్ ప్రతిపాదనపై మరోసారి చర్చ

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ పట్టణ పరిధిలో ప్రతిపాదిత డంప్ యార్డ్ అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యుడు వేమ్ నరేందర్ రెడ్డిని కలిసి ఈ విషయంపై మరొక్కసారి వినతి పత్రం అందజేశారు. సిర్సపల్లి శివారులో ఏర్పాటు చేయాలని భావిస్తున్న డంప్ యార్డ్ ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. ఈ ప్రాజెక్ట్ వల్ల స్థానిక ప్రజలకు కలిగే ఇబ్బందులు, వ్యవసాయంపై పడే ప్రతికూల ప్రభావాలను … Read more

హుజురాబాద్‌లో బంద్ విజయవంతం – డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా ప్రజల ఐక్యరూపం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్‌లో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన బంద్ విజయవంతంగా సాగింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరియు జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు, వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మద్దతు తెలపడంతో పట్టణం పూర్తిగా మూతపడింది.బంద్ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నాయకత్వంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించబడింది. అనంతరం ఆయన మాట్లాడుతూ, హుజురాబాద్ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం … Read more

ప్రజల సమస్యల పరిష్కారానికి “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” గ్రామసభ

జమ్మికుంట/ధనాధన్ న్యూస్:పెద్దంపల్లి గ్రామంలో సర్పంచ్ ఎగిత పద్మ కుమార్ అధ్యక్షతన “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” గ్రామసభను ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజల సమస్యలను గుర్తించి వాటికి తక్షణ పరిష్కారాలు చూపించడం ఈ సమావేశం ప్రధాన లక్ష్యంగా నిలిచింది.ఈ సందర్భంగా సర్పంచ్ ఎగిత పద్మ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికను రాష్ట్రవ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేస్తున్నదని తెలిపారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, … Read more