మరికొన్ని క్షణాల్లో పది పలితాల విడుదల

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పదో తరగతి ఫలితాలు ఇవాళ (బుధవారం) విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు SCERT Telangana ఆడిటోరియంలో ప్రభుత్వ సలహాదారు K. Keshava Rao ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు.ఈసారి పరీక్షలను విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా ప్రత్యేకంగా ప్లాన్ చేశారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు దశలవారీగా నిర్వహించి, ప్రతి పరీక్షకు మధ్య 3-4 రోజుల విరామం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 2,676 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు సుమారు … Read more

ఘనంగా తెలంగాణ జన సమితి 8వ ఆవిర్భావ వేడుకలు

కరీంనగర్/ధనాధన్ న్యూస్ ఏప్రిల్ 29:తెలంగాణ జన సమితి (TJS) పార్టీ 8వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కేంద్రంలో పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాయి.సామాజిక బాధ్యతలో భాగంగా జిల్లా కేంద్రంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు వృద్ధాశ్రమ నివాసితులతో నేరుగా మాట్లాడి, వారి ఆరోగ్యం మరియు ఇతర అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. వృద్ధులకు ఎల్లవేళలా అండగా ఉంటామని, వారి … Read more

సైదాపూర్‌లో అభివృద్ధి పనులపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం

సైదాపూర్/ధనధాన్ న్యూస్ ఏప్రిల్ 28: సైదాపూర్ మండలంలోని విశాల సహకార ప్రకృతి సంఘం ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల వారీగా పెండింగ్ పనులు, అభివృద్ధి కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని కార్యకర్తలకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెంచేందుకు … Read more

పోషణ్ పక్వాడ ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహణ

సైదాపూర్/ధనధాన్ న్యూస్,ఏప్రిల్ 25:కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెంకేపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడ ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐసిడిఎస్ సీడీపీవో ఎం. సుగుణ మాట్లాడుతూ, ప్రీ-స్కూల్ మేళ, గర్భిణి స్త్రీల కోసం శ్రీమంతం కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహించామని తెలిపారు. అలాగే ఆరు నెలలు నిండిన శిశువులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించడంతో పాటు, చిన్నారుల కోసం గ్రాడ్యుయేషన్ డేను కూడా విజయవంతంగా జరిపినట్లు వెల్లడించారు. ఈ … Read more

జమ్మికుంట బీజేపీ ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడిగా పుల్లూరి ప్రశాంత్ నియామకం

జమ్మికుంట/ధనధాన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడిగా పుల్లూరి ప్రశాంత్‌ను నియమించారు. ఈ నియామకం పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ప్రశాంత్ మాట్లాడుతూ, వార్డ్ బూత్ అధ్యక్షుడిగా పనిచేసిన తనను పట్టణ అధ్యక్షుడిగా ఎంపిక చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన జిల్లా అధ్యక్షుడు కృష్ణరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు, … Read more

హుజురాబాద్‌ను చెత్త కుప్పగా మారనివ్వం: డంపింగ్ యార్డ్‌పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర హెచ్చరిక

హైదరాబాద్/ధనాధన్ న్యూస్,ఏప్రిల్ 17: హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ ఏర్పాటుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు.హుజురాబాద్ ప్రాంతంలో నాలుగు జిల్లాల చెత్తను తరలించి డంపింగ్ యార్డ్ నిర్మించాలన్న ప్రణాళిక ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ వల్ల గాలి, నీరు, భూమి కాలుష్యానికి గురై ప్రజల జీవన ప్రమాణాలు … Read more

విద్యా రంగంలో మరో మైలురాయి – మిలీనియం స్కూల్‌కు శిక్ష అవార్డు

హైదరాబాద్/ధనాధన్ న్యూస్: ప్రముఖ విద్యా సంస్థ LEAD నిర్వహించిన “శిక్ష అవార్డ్స్”లో మిలీనియం స్కూల్ మరో కీలక మైలురాయిని సాధించింది. సంస్థ రూపొందించిన కరికులం ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలను సమీక్షించి, ఆ కరికులాన్ని అత్యుత్తమంగా అమలు చేసిన విద్యాసంస్థలకు ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. ఈ క్రమంలో మిలీనియం స్కూల్ జాతీయ స్థాయిలో విశిష్ట ప్రతిభ కనబరిచి “శిక్ష అవార్డు”ను అందుకుంది.ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం హైదరాబాద్‌లోని నవోటెల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా జరిగింది. ఈ … Read more

ఘనంగా డా.బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

సైదాపూర్/ధనాధన్ న్యూస్ ఏప్రిల్ 14:సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ గుర్రాల స్వతంత్ర ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా డా. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజీ విగ్రహాలకు కూడా పూలమాలలు సమర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ గుర్రాల స్వతంత్ర మాట్లాడుతూ, చిన్ననాట కుల వివక్షను ఎదుర్కొన్నప్పటికీ డా. … Read more

జాతీయ రోడ్డు భద్రత మనందరి బాధ్యత: సర్పంచ్ గుర్రాల స్వతంత్ర

సైదాపూర్/ధనాధన్ న్యూస్ ఏప్రిల్ 13:సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గుర్రాల స్వతంత్ర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాపాయానికి దారి తీస్తుందని హెచ్చరించారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, పొల్యూషన్ సర్టిఫికెట్ వంటి అవసరమైన పత్రాలను … Read more

“సామాన్యుల కాలనీల దుస్థితి: రోడ్లు, డ్రైనేజీలు లేక ప్రజల ఆవేదన”

ఒంగోలు/ధనాధన్ న్యూస్,ఏప్రిల్ 12:సామాన్య ప్రజలు నివసించే కాలనీల్లో కనీస మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల కాలనీల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండగా, సాధారణ ప్రజల కాలనీల్లో మాత్రం రోడ్లు, డ్రైనేజీలు లేక దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని విమర్శిస్తున్నారు.ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలోని జయప్రకాష్ కాలనీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. డ్రైనేజీలు లేకపోవడం, సీసీ రోడ్లు దెబ్బతినడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు … Read more